Skip to main content

ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు? - కేంద్రానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న


 ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు? - కేంద్రానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూటి ప్రశ్న


#ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర నిర్ణయాలు?


 #చేతి వృత్తులను దెబ్బతీసేందుకు కుట్ర


#బండి సంజయ్ యాత్ర ఎందుకూ...?


#తెలంగాణాలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసమా..?

హైదరాబాద్:; ఎవరి కోసం విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర యస్.సి.సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.  రైతులు, వెనుకబడిన వర్గాలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు చేతి వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారి ప్రయోజనాలు దెబ్బతీయడంలో భాగమే అన్నారు. ఎల్ఐసీ, రైల్వే, టెలిఫోన్ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్న కేంద్రం.. వ్యవసాయ రంగం, కోళ్ల పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలపై ఆధారపడి జీవనం చేసుకునే వారిని కూడా వదలటం లేదని ఆరోపించారు. ఏ పెద్దల మెప్పుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. దేశ చరిత్రలోనే తొలి సారిగా వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు. కొత్తగా విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ఆరోపించారు. 

*బండి పాదయాత్ర ఎందుకూ*

బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర దేనికోసమని సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల రద్దు కోసం అయి ఉంటుందని ఆయన ఎద్దేవాచేశారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్రాలలో కళ్యాణాలక్ష్మి/షాధి ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్, అమ్మ వడి, అన్నింటికీ మించి రైతు బంధు,రైతు భీమా వంటి పధకాలు లేక పోవడంతో అక్కడి ప్రజలు బిజెపి నేతలను నిలదీస్తుండటంతో తట్టుకోలేకనే ఇక్కడ కుడా ఎత్తి వేయలన్నది ఆ పార్టీ వ్యూహం అయి ఉండొచ్చన్నారు.ఇప్పటికే మూడు సార్లు పాదయాత్ర జరిపిన ఆయన గాని ప్రచార పటాటోపంతో పబ్లిసిటీ కోసం ఢిల్లీ నుండి తరలి వస్తున్న నేతలు ఇక్కడి ప్రజలకు ఏమి చేస్తారు అన్నది చెప్పలేక పోయారని ఆయన ఎత్తి పొడిచారూ.అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రంగాలకు విద్యుత్ నందించడంతో పాటు దేశంలోనే ఎక్కడ లేని విదంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను ఎత్తివేసేందుకే బండి పాదయాత్ర జరుగుతున్నట్లుందన్నారు. అందుకే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం తరహాలోనే తెలంగాణా లో మోటర్లకు మీటర్లు పెట్టేందుకు బిజెపి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణల అమలుకు ప్రజలపై వత్తిడి తెచ్చేందుకే బండి పాదయాత్ర అసలు సారాంశం అని ఆయన పేర్కొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్