అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె* *నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరెను పరిశీలించిన బండి సంజయ్*


 *అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె*


*నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరెను పరిశీలించిన బండి సంజయ్*


*చీరెలోనే రామాయణ ఇతివ్రుత్తానికి సంబంధించిన చిత్రాలు పొందుపర్చిన హరిప్రసాద్*


*26న ప్రధానికి అందించనున్నట్లు హరిప్రసాద్ వెల్లడి*


*హరిప్రసాద్ ను అభినందించిన బండి సంజయ్*



అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు. 


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. 


అనంతరం మీడియాతో మాట్లాడుతూ….ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు క్రుషి చేస్తానని హమీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్