ప్రజాస్వామ్య బద్ధంగా కాశి సత్రం ఎన్నికలు* 41 మంది నామినేషన్ల పత్రాలు స్వీకరణ*






 

 ప్రజాస్వామ్య బద్ధంగా కాశి సత్రం ఎన్నికలు*

41 మంది నామినేషన్ల పత్రాలు స్వీకరణ*

హైద్రాబాద్ : (గూఢచారి ప్రతినిధి)

శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లకడికపూల్ వాసవి సేవా కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న  41 మంది అర్హత ఉన్న  సభ్యులు  దాదాపు 135 నామినేషన్లు పత్రాలు  ఎన్నికల అధికారి నుండి తీసుకున్నారు.

 ఈ ఎన్నికల్లో అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు) సెక్రటరీలు ఏడుగురు, (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు), అడ్వైజర్లు 19 మంది కి (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి 13 మంది కర్ణాటక నుండి నాలుగు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒక్కరు) ఎన్నికలు నిర్వహించబడతాయి. 

ఆగస్టు 16, 17 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 18వ తేదీ స్క్రూట్ని నిర్వహిస్తారు. ఆగస్టు 19 న ఉపసంహరణకు అవకాశం ఉంది. 

నామినేషన్ పత్రాలు స్వీకరించిన వారి వివరాలు




Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ