బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్ధుల సమస్యలు పరిష్కరించండి - పేరెంట్స్ కమిటీ


 

 బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్ధుల సమస్యలు పరిష్కరించండి - పేరెంట్స్ కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలో నల్లగొండ జిల్లాలో సోషల్ వెల్ఫేర్ సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా దళిత విద్యార్థులు వేల మంది చదువుకుంటున్నారనీ విద్యార్థులకు రావాల్సినటువంటి వస్తువులను ఇప్పించి సమస్యను పరిష్కరించవలసిందిగా పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు మాతంగి అమర్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేశారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయము లో గ్రీవెన్స్ డే లో వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రం లో ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజ్ యాజమాన్యానికి చెల్లయించవలసిన బిల్లులు చెల్లించక విద్యార్థుల భవిష్య త్తు ప్రశ్నార్ధకంగా మారిందనీ, బిల్లులు రాకపోవడంతో స్కూలు యజమాన్యాలు ఈ స్కీమ్ లో ఉన్న విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు వారికి ఇవ్వాల్సిన వస్తువులు వారికి ఇవ్వడం లేదనీ, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో ఈ సంవత్సరం సీట్ వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు అడ్మిషన్ తీసుకోవడం లేదనీ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని విద్యార్థి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ లో విద్యార్థులకు రావాల్సినటువంటి వస్తువులను ఇప్పించి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులుగా కలెక్టర్ వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కందుల నరేందర్ , నిరసన మెట్ల చిరంజీవి, కొమ్ము శేఖర్ , సూరారపు రవి, శ్రీకాంత్, వినోద్, నరసింహ, యాదగిరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు

 



.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్