ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..


 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..


అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు