చెన్నైలో ఘనంగా IFWJ 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం
చెన్నైలో ఘనంగా IFWJ 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం
దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై విస్తృత చర్చ
భారత్ జయహో హైదరాబాద్ డిసెంబర్ 27
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (IFWJ) ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన 79వ కార్యవర్గ–జాతీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ జాతీయ స్థాయి సమావేశానికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య అధ్యక్షత వహించారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా జర్నలిస్టుల అక్రిడేషన్ విధానం, పత్రికా స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలు, మీడియాపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల భద్రత, సంక్షేమ పథకాలు వంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, వారి రక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని వక్తలు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ డబ్ల్యూ జి సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా స్వేచ్ఛే బలమైన పునాది అని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులను కాపాడటం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం జాతీయ స్థాయిలో ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో IFWJ జాతీయ ఉపాధ్యక్షులు డా. పెద్దాపురం నరసింహ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్, రాష్ట్ర నాయకులు గండ్ర నరేందర్, సాయి శరత్ తదితర ప్రముఖ జర్నలిస్టు నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


Comments
Post a Comment