స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం
స్వర్ణ గిరి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప్పల కుటుంబం*
వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భువనగిరిలోని ప్రసిద్ధ స్వర్ణ గిరి దేవాలయాన్ని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసమృద్ధులు కలగాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి వైకుంఠ ఏకాదశి విశిష్టతను వివరించారు.
శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినమని, ఈ రోజున స్వామివారి దర్శనం చేయడం వల్ల ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని తెలిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
వేద పండితుల ఆశీర్వాదం అందించిన మానేపల్లీ గోపి, మానే పల్లి మురళి లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న కుమారుడు ఉప్పల సాయి కిరణ్ చిన్న కుమారుడు ఉప్పల సాయి తేజ అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్త బావ బచ్చ సతీష్ , సోదరీమణి ఉదయ శ్రీ తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment