భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు
*భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్ నామినేషన్ దాఖలు*
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ *డివిజన్ నెం. 25 భగీరథ కాలనీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెయిన్ బో శ్రీనివాస్* శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తనకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కార్యాలయ కార్యదర్శిగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ టెలికాం బోర్డ్ మెంబర్ గా పనిచేసిన అనుభవంతో పాటు, భగీరథ కాలనీలోని ఉద్యోగస్తులు, యువత, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మహిళలతో పాటు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో డివిజన్ నెంబర్ 25 నుండి తాను గెలుపొందడం ఖాయమని ఈ సందర్భంగా రెయిన్ బో శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో లక్ష్మణ్ రావ్, ఇంతియాజ్, కొంతం లక్ష్మణ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment