రవీందర్ కు పోలీస్ సేవా పథకం
రవీందర్ కు పోలీస్ సేవా పథకం
సంగారెడ్డి:
జిల్లా పోలీస్ శాఖలో ఐటి విభాగంలో పనిచేస్తున్న ఏఎస్ఐ మునగాల రవీందర్ కు సేవా పథకం లభించింది ఈ మేరకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో బహూకరించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ లు ఆయనకు మెడల్ ను అందించారు. జిల్లా పోలీస్ శాఖలో రవీందర్ ఒక్కరికి మాత్రమే ఈ మెడల్ లభించింది. దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలను అందించిన సందర్భంగా రవీందర్ కు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా ఆయన్ని జిల్లా ఎస్పీ తో పాటు పలువురు అధికారులు అభినందించారు. సహచరులు శుభాకాంక్షలు తెలిపారు.రవీందర్ మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులను నిర్వహిస్తున్నామని అన్నారు. అప్పగించిన బాధ్యతను నిబంధనల కు అనుగుణంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

Comments
Post a Comment