నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి*
*నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం*
- *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి*
*మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు*
**************************************************
*నల్లగొండ*:
**ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు*
*శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు*
*ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు*
*నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో కేంద్ర,రాష్ట్రాల నుంచి అత్యధిక నిధులు వస్తాయన్నారు*
*దీంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు*
*ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు*
*కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లోని కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు*
*బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్గొండలో అభివృద్ధి శూన్యమని అన్నారు*
*గతంలోనూ, ఇప్పుడూ నల్గొండ అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే జరిగిందని పేర్కొన్నారు
గత మున్సిపల్ ఎన్నికల్లో కొద్దీ తేడాతో చైర్మన్ పీఠం చేజారిందని తెలిపారు
అప్పట్లో భువనగిరి ఎంపీ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో ఫోటో తోనే 20 స్థానాల్లో కౌన్సిలర్లు విజయం సాధించారని అన్నారు.
ఈసారి 48 డివిజన్ లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధితో పాటు పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు.
నల్గొండలో ఎలాంటి ఘర్షణలకు తావు లేదని తెలిపారు.
తనను కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా, చైర్మన్‌గా చేసిన వార్డు ,పట్టణ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు.
ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో చెయ్యి గుర్తుకు ఓటు వేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
*కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ*
తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వారి సహకారంతో నల్గొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతానని అన్నారు.
తాను పోటీ చేస్తున్న 32వ డివిజన్‌తో పాటు అన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు.
గతంలో కౌన్సిలర్‌గా గెలిపించిన ప్రజలు కార్పొరేటర్ గా ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగాల అనిల్ రెడ్డి, బండా వెంకటేశ్వర్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, భోదనం సుధాకర్ రెడ్డి, శేఖర్, సైదులు గౌడ్, అలుగుబెల్లి కిరణ్ రెడ్డి, బండ అంజిరెడ్డి, వంగాల సుమతి తదితరులు పాల్గొన్నారు*.

Comments
Post a Comment