Posts

భూపతి టైమ్స్ 1st నవంబర్ 2025

Image
  https://heyzine.com/flip-book/513a26f269.html

కన్యకాపరమేశ్వరి ఆలయ మొదటి వార్షికత్సవం లో పాల్గొన్న ఉప్పల

Image
  కన్యకాపరమేశ్వరి ఆలయ మొదటి వార్షికత్సవం లో పాల్గొన్న ఉప్పల మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ కో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మించి సంవత్సరం ఐన సందర్బంగా మొదటి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీందర్ గుప్త గారు, రేబర్తి శ్రీనివాస్ గారు, IVF రాష్ట్ర నాయకురాలు శ్రీలత గారు, IVF కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్షులు చిరంజీవి రవీందర్ గుప్తా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి బద్రీనాథ్ కోశాధికారి పైడి రమేష్ గుప్తా కార్యదర్శి గట్టు చంద్రశేఖర్ గుప్తా  మేడ్చల్ మల్కాజి జిల్లా ఇన్చార్జ్ రెబెల్లి శ్రీనివాస్ గుప్తా కాప్రా మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అంబేద్కర్ నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నంగునూరు అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు

భూపతి టైమ్స్ 31st అక్టోబర్ 2025

Image
 

*ఏసీబీకి పట్టుబడ్డ TS Transco DE*

Image
*ఏసీబీకి పట్టుబడ్డ TS Transco DE* మెదక్ జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో సంగారెడ్డి ఏసీబీ అధికారులు రైడ్ చేయగా DE మహమ్మద్ షరీఫ్ ఖాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తి కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేసుకొనుగా అందుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటకు DE  ₹40 వేల రూపాయలు డిమాండ్ చేయగా 30వేల ఇచ్చుటకు ఒప్పందం కుదిరినది.  ముందుగా తొమ్మిది వేలు చెల్లించినారు.ఈరోజు 21 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో యాదగిరిగుట్ట దేవస్థాన ఇంజనీర్

Image
 ఏసీబీ వలలో యాదగిరిగుట్ట దేవస్థాన ఇంజనీర్ 29.10.2025న, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, ఇంజనీర్ మరియు ఎండోమెంట్స్ విభాగం, ఐ/సి సూపరింటెండింగ్ ఇంజనీర్, టి.జి., నిందితుడు శ్రీ వూడేపు వెంకట రామారావు, మెడిపల్లి, మేడిపల్లి, మల్కాజ్‌గిరి జిల్లా, మేడిపల్లి, మెడ్‌ప్లస్ ఫార్మసీ ముందు, నల్గొండ రేంజ్ ఎసిబి చేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. "యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆహార యంత్రాల సంస్థాపనకు సంబంధించి AO ప్రాసెస్ చేసిన రూ. 11,50,445/- (GST మినహాయించి) బిల్లు మొత్తానికి" ఫిర్యాదుదారుడి నుండి బహుమతిగా రూ. 1,90,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 1,90,000/- ను అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, గౌరవనీయులైన IIవ అదనపు Spl. SPE మరియు ACB కేసుల జడ్జి, నాంపల్లి, హైదరాబాద్ ముందు హాజరుపరుస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ

Image
 ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ Oct 29, 2025,  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్ద అంబర్ పేట్ ఏఈ పెద్ద అంబర్ పేట విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ప్రభులాల్, కరెంట్ కనెక్షన్, మీటర్ రీప్లేస్మెంట్, బిల్లింగ్ సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తి నుండి రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, బుధవారం లంచం తీసుకుంటుండగా అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభులాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భూపతి టైమ్స్ 30th అక్టోబర్ 2025

Image