Posts

ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు

Image
 ఏం.ఫార్మసి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసిన సెల్ వెల్ సంస్థ సీఎండీ సుబ్బా రావు హైదరాబాద్:  సెల్ వెల్ సంస్థ సీఎండీ విద్యా దాత సుబ్బా రావు సార్ చంద్రిక M. ఫార్మసి చదువు కాలేజ్ ఫీజు నిమిత్తం 35000 చెక్ అందచేశారు. ఈ సందర్భంగా మొగుళ్ళపెల్లి ఉపేందర్ సుబ్బారావు కు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలిపారు.

పంచముఖ హనుమాన్ దేవాలయంలో 18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..

Image
 నల్గొండ పట్టణంలో ఆధ్యాత్మిక శోభ..! నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో భక్తుల జయజయధ్వానాల నడుమ *18 అడుగుల విరాట హనుమంతుని విగ్రహ ప్రతిష్ట* ఘనంగా నిర్వహణ..! వేద మంత్రోచ్చారణలు, పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో విగ్రహ ప్రతిష్ట పూర్తి... భారీగా తరలివచ్చిన భక్తజనం... జై శ్రీరాం నినాదాలతో మారుమ్రోగిన కాలనీ పరిసరాలు..! ప్రాంత ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు... భక్తి.. శక్తి.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం వెంకటేశ్వర కాలనీ పంచముఖ హనుమాన్ ఆలయం...

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత..

Image
 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత.. గచ్చిబౌలి లోని కేశవ్ నగర్ లో ఉంటున్న సాయి కిరణ్ (26)దగ్గర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న మాదాపూర్ జోన్ ఏస్ఓటీ పోలీసులు..  లక్ష 30వేల విలువ చేసే 11గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్,రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం.. బెంగుళూరు నుండి తెచ్చి హైదరాబాద్ లో అమ్మడానికి ప్రయత్నిస్తున్న సాయి కిరణ్.. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న సాయి కిరణ్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్న సాయికిరణ్.. విశ్వసనీయ సమాచారంతో సాయి కిరణ్ ను పట్టుకున్న మాదాపూర్ sot పోలీసులు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి

Image
 కామారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా సివిల్ సప్లై కార్యాలయంపై ACB దాడి 2026 జనవరి 24న మధ్యాహ్నం 12:15 గంటలకు, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కామారెడ్డిలోని జిల్లా మేనేజర్ కార్యాలయంలో ACB అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో, అనేక లోపాలు బయటపడ్డాయి. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో: 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 581 మెట్రిక్ టన్నులు (₹64 లక్షలు). 2022-23 ఖరీఫ్ సీజన్‌లో: 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 2 రైస్ మిల్లర్లపై చర్యలు, కొరత: 19,529 మెట్రిక్ టన్నులు (₹41 కోట్లు). 2023-24లో: ఖరీఫ్ సీజన్‌లో 7 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు; 3 రైస్ మిల్లర్లపై చర్య, లోటు: 5,194 మెట్రిక్ టన్నులు (₹2.5 కోట్లు). 2023-24లో, గ్రీన్ హిల్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ (కోడ్: 177375) కస్టమ్ మిల్డ్ రైస్‌ను చెల్లించడంలో డిఫాల్ట్ అయింది, దీని ఫలితంగా క్రిమినల్ కేసు నమోదైంది. అయినప్పటికీ, అధికారులు ఖరీఫ్ మరియు రబీ 2024-25 దిగుబడిని అదే మిల్లర్‌కు కేటాయించారు. సెప్టెంబర్ 2025 నుండి, జిల్లా పౌర సరఫరా అధికారి మరియు జిల్లా మేనేజర్,...

కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం

Image
  కోమటి రెడ్డి ప్రతీక్ బొట్టుగూడ హై స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రసంగం మార్కులు–ర్యాంకులకే పరిమితమైన సంప్రదాయ విద్యపై విమర్శ ఆలోచనకు కాదు, గుర్తుపెట్టుకునే చదువుకు పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్య ఒత్తిడితో పిల్లల సహజ కుతూహలం, సృజనాత్మకత నశిస్తున్నాయన్న ఆందోళన చదువు పోటీగా మారిందని, ఆనందకరమైన ప్రయాణం కావాలని పిలుపు వాల్డార్ఫ్ విద్యా విధానం నుంచి ప్రేరణతో కొత్త బోధనా దృక్పథం ఆలోచన–భావన–కార్యాచరణ… మూడు స్థాయిల్లో పిల్లల అభివృద్ధి లక్ష్యం అనుభవాత్మక విద్యకు ప్రాధాన్యం – చేతలతో నేర్చుకునే విధానం గార్డెన్ పనులతో సహనం, ప్రకృతితో అనుబంధం కుండల తయారీ, రాయి చెక్కుదలతో ఏకాగ్రత, సృజనాత్మకత వికాసం ఇసుక ఆటలతో కల్పనాశక్తి విస్తరణ నృత్యం, యోగా ద్వారా శరీరం–మనస్సు సమతుల్యత ఇండోర్ ఆటలతో సామాజిక, భావోద్వేగ నైపుణ్యాల పెంపకం ఆధునిక పోటీ ప్రపంచానికి పిల్లలను సిద్ధం చేసే దృష్టి పూర్తిగా డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, STEM విద్య, గ్రంథాలయం, స్పోర్ట్స్ రూమ్స్ లిఫ్ట్ సదుపాయం, స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో సంప్రదాయ విద్య + వాల్డార్ఫ్ ప్రేరణ...

Big Breking మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Image
 Big Breking మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 31న స్క్రూటినీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని SEC రాణి కుముదిని తెలిపారు.

నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం!

Image
 నల్గొండ 5 వ డివిజన్ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం! నల్గొండ: పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, కనీసం పార్టీ కోసం కష్టపడిన వారి అభిప్రాయం తీసుకోకుండా, కార్పొరేటర్ సీటు విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వల్ల, పాత కాంగ్రెస్ వారికి అన్యాయం జరుగు తుందని పాత కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు.   గత ఎమ్మెల్యే ఎలక్షన్లలో కష్టపడిన వారు అందరూ కూడా వేరే ప్లాట్ఫారం చూసుకావలసి వస్తుందని, రెండు రోజులలో ఐదవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందని వారు అంటున్నారు.