పి డి ఎస్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల జప్తు ఖాయం. - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
పి డి ఎస్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాల జప్తు ఖాయం.
- పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
నల్గొండ జిల్లా:
రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల్లో ఎక్కువ మార్లు పట్టుబడిన వాహనాల ఆర్ సి రద్దు కు సిఫారసు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ..రేషన్ బియ్యం అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా.. నుంచి వచ్చి నాంపల్లి,గుర్రంపోడ్, చింతపల్లి ప్రాంతాల్లో రేషన్ బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసే దందా చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.ఒకే వాహనాన్ని మూడు సార్లు, అంతకన్నా ఎక్కువ మార్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు ఉపయోగిస్తే అట్టి వాహనం ఆర్ సి తో పాటు వాహనం నడిపిన వ్యక్తి లైసెన్స్ రద్దు కు కూడా సిఫారసు చేస్తానని మాచన రఘునందన్ హెచ్చరించారు.సన్న బియ్యం ను కూడా కొంతమంది వద్ద అధిక ధరకు కొని అమన్ గల్, కడ్తాల్ మీదుగా..మహేశ్వరం, శంషాబాద్ , హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.ఈ అక్రమ రవాణా కు పటిష్ట నిఘా తో చెక్ పెట్టనున్నట్టు వివరించారు.రేషన్ బియ్యం అక్రమ రవాణా లో కొందరు పోటీ పడి మరీ దందా చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. లూనా పై ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం కొని,అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము వరకల్లా చిన్న, చిన్న మిల్లుల కు గుట్టుగా తరలించే పని చేస్తున్నారని రఘునందన్ ఆరోపించారు. కొందరు ఏకంగా రేషన్ బియ్యం ను నూకలు చేసే దందా చేస్తున్నారని రఘునందన్ అన్నారు.రేషన్ బియ్యం దొంగలు దశావతారాలు ఎత్తినా..పట్టుబడటం ఖాయం అని హెచ్చరించారు
Comments
Post a Comment