*తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*


 


*తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ - మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*




*తీరొక్క పూలతో ప్రకృతిని దైవంగా పూజించే గొప్ప పండుగ*


*తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు*


- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 


*హైదరాబాద్:*

తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ మంత్రి "ఎంగిలిపూల" బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 


"ఎంగిలి పూల"బతుకమ్మ తో మొదలై "సద్దుల బతుకమ్మ" వరకు తీరొక్క పూలతో ప్రకృతినే దైవంగా పూజించే గొప్ప పండుగ అని తెలిపారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణం బతుకమ్మ పండుగనీ, సాయుధ రైతాంగ పోరాటంలో,రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.


బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా ఆడబిడ్డలు, పిల్లాపాపలతో ప్రత్యేక సందడి నెలకొంటుందన్నారు. ఈ తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగను ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని, ప్రజల జీవితాల్లో బతుకమ్మ వెలుగులు నింపాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం