*వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్*
*వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్*
*హైదరాబాద్:* వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణచారి అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఎల్బీనగర్ శ్రీ రామచంద్ర మిషన్ వెల్నెస్ సెంటర్లో రాష్ట్రస్థాయి నీట్ పేరెంట్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా మల్లోజు సత్యనారాయణచారి, , ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బొడ్డుపల్లి అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే జాయింట్ సెక్రెటరీలుగా దొడ్డేపల్లిరఘుపతి, రాజుగౌడ్, చీఫ్ అడ్వైజర్ గా బీరెల్లి కమలాకర్ రావు, కోశాధికారిగా ఎం . శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్. భాస్కర్ రావు, కే. రవి కుమార్, పి. సుజాత, కార్యవర్గ సభ్యులుగా గడ్డం స్వప్న, పబ్బం మానస, కే నరహరి, టి. రత్న ప్రసాద్, నరేందర్ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది.సుమారు 1000 మంది వరకు పాల్గొన్న ఈ సమావేశంలో వైద్య విద్యార్థులకు స్థానికత కల్పించే జివో నెంబర్ 33 అమలుపై నీట్ పేరెంట్స్ చేపట్టిన ఉద్యమం, సుప్రీంకోర్టు వరకు వెళ్లి నీట్ విద్యార్థుల తరఫున కేసులో ఇంప్లిడ్ అయి సాధించుకున్న విజయాల పట్ల చర్చించడం జరిగింది. ఈ నీట్ పేరెంట్ అసోసియేషన్ ఇలానే ఎక్కడ ఆగకుండా నేటి విద్యార్థులు వైద్యులుగా మారేంతవరకు వారికి తర్వాత కూడా మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ గా మార్పు చెంది మెడికల్ విద్యార్థులకు అండగా ఉంటామని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన చారి మాట్లాడుతూ వైద్య విద్యార్థుల స్థానికత కు సంబంధించిన జీవో 33 గత ఏడాది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో 86 మంది తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులు ఎంబిబిఎస్ లో సీట్లు కోల్పోయారని,గత ఏడాది స్థాని కేతరులు 135 మంది విద్యార్థులు కోర్ట్ కు వెళ్లడం తో మధ్యంతర ఉత్తర్వులు ద్యారా వారికి మెడికల్ సిట్లు పొందారు. అలాగే ఈ ఏడాది కూడా మళ్లీ 459 మంది విద్యార్థులు కోర్ట్ కు వెళ్లగా సుప్రీం కోర్ట్ గత వారం తీర్పును వెల్లడించారు. తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానికత రావాలంటే కచ్చితంగా వరుసగా 4 సంవత్సరాలు అనగా 9,10 ఇంటర్ రెండు సంవత్సరాలు తప్పనిసరి అని తీర్పును వెళ్ళడించారు. జీవో 33 ఖచ్చితంగా అమలు చేయాలని నీట్ పేరెంట్స్ అంతా కలిసి పలు ఉద్యమాలు చేపట్టి విజయవంతం అయ్యామన్నారు. తెలంగాణ స్థానికత సంబంధించి జీవో 33 అమలుపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అనేది తెలంగాణ స్థానికత అంశంపై పోరాడమే కాకుండా, భవిష్యత్తులో వైద్య కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా స్పందించే విధంగా అసోసియేషన్ ను కొనసాగించాలని నిర్ణయంతో రాష్ట్రస్థాయి నీట్ పేరెంట్ అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశం లో ప్రధాన కార్యదర్శి రమేష్ పొడిశెట్టి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ర్యాగింగ్ లాంటి వివిధ వైద్య విద్యార్థుల సమస్యలపై పోరాటం జరపడంతో పాటు వైద్య విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేస్తామని, మా విద్యార్థుల సమస్యలను ఇటు ఆందోళన కార్యక్రమాల ద్వారా కావచ్చు లేదా వినతి పత్రాలు ద్వారా కావచ్చు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు ఉమ్మడి 10 జిల్లాల స్థాయిలో ఇన్చార్జిలను నియమించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నీట్ మెంటర్ జైపాల్ లాండే పలువురు నీట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నీట్ కౌన్సిలింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యు జె ఏ సి నాయకులు దత్తాత్రి వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ అకాడమీ చైర్మన్ రాజు గౌడ్ మరియు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నీట్ పేరెంట్స్ పెద్ద సంఖ్య లో పాల్గొనడం జరిగింది.

Comments
Post a Comment