హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్


 

హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ 

హైదరాబాద్, గూఢచారి: 

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ – కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసింది.

ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు.

“పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలి. దీనివల్ల గాలి కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించడం, కార్పూలింగ్, సైక్లింగ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఢిల్లీ స్థాయి గాలి కాలుష్యం మన నగరాలకు చేరుకునే ముందు మనం కళ్ళు తెరవాలి,” అని ఆరోబిందో ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ డా. సతీష్ అన్నారు.

టీజీపీసీబీ అధికారులు స్టాల్ ప్రాంగణంలో ప్రజెంటేషన్లు నిర్వహించి, పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమలు, సంస్థలు మరియు సామాన్య ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. శుభ్రమైన సాంకేతికతల వినియోగం, వ్యర్థాల వేర్పాటు మరియు శాస్త్రీయ విధానంలో నిర్వాహణ, పరిశ్రమల మురుగు నీటి శుద్ధి, గాలి మరియు శబ్ద కాలుష్య నియంత్రణ, ఈ-వ్యర్థాల సముచిత నిర్వహణ పై వారు వివరించారు.


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం