గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్


 గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు - 

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ 


గ్యాస్ సిలిండర్ సరఫరాలో అక్రమాలు ఉపేక్షించే ప్రసక్తే లేదని,గ్యాస్ డెలివరీ బాయ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కు అధిక వసూళ్లపై కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయగా.. శనివారం నాడు గ్యాస్ సరఫరా చేసే బండ్ల ను 

తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీకి అక్రమంగా అధికంగా వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. గ్యాస్ బండల సరఫరాలో కొందరు డెలివరీ బాయ్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదు లు వస్తున్నాయన్నారు. అక్రమ వసూళ్ల కు పాల్పడే వారిపై ఒక్కరు ఫిర్యాదు చేసినా చాలు అని రఘునందన్ సూచించారు. గ్యాస్ కు రశిదు కూడా ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. గ్యాస్ ఎజెన్సీ అనుమతి రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు అని హెచ్చరించారు. వినియోగదారుల ను వి ఐ పి లు గా పరిగణించాలని సూచించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం