*ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్*
*ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్*
*హైదరాబాద్, సెప్టెంబర్ 1:* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు సైఫాబాద్ లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ గ్యారెంటీకి, విశ్వాసానికి, ఆర్థిక భద్రతకు ప్రతీక అని, 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని శతాబ్ది వైపు సాగాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం ఏళ్లుగా ఎల్‌ఐసీతో అనుబంధం కలిగి ఉందని తెలిపారు.
జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణ అందించడమే లక్ష్యమని, ఏడు దశాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసాన్ని నిలబెట్టుకున్న సంస్థ ఎల్‌ఐసీ అని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు బీమా వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ప్రముఖ ఏజెంట్ కౌటికె విఠల్ మాట్లాడుతూ ఎల్‌ఐసీకి నిజమైన బలం ఏజెంట్లేనని, పాలసీదారుల సంతృప్తే తమ సంతృప్తి అని అన్నారు. "యోగక్షేమం వహామ్యహమ్" అనే ధ్యేయంతో ఎల్‌ఐసీ సాగుతోందని వక్తలు పేర్కొన్నారు.

Comments
Post a Comment