Posts

Showing posts from September, 2026

రూ. 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మొయినాబాద్ మున్సిపల్ అధికారులు

Image
 రూ. 75,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మొయినాబాద్ మున్సిపల్ అధికారులు   మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపాలిటీకి చెందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (AO-1) గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ (AO-2) ఎలమోని సుదర్శన్ రూ. 75,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.   ఘటన వివరాలు: ఫిర్యాదుదారు నిర్మిస్తున్న భవనాన్ని సక్రమమైనదిగా పరిగణించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు (అధికారిక లబ్ధి చేకూర్చేందుకు) ఏఓ-1 గుండు వాణి రూ. 75,000 లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ ఏఓ-2 సుదర్శన్ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.   సుదర్శన్ వద్ద నుంచి లంచం డబ్బు రూ. 75,000ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ విధులను అక్రమంగా, అన్యాయంగా నిర్వహించినందుకుగానూ ఇద్దరు అధికారులను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. రక్షణ కారణాల రీత్యా ఫిర్యాదుదారు వివరాలను ఏసీబీ గోప్యంగా ఉంచింది.   ఏసీబీ విజ్ఞప్తి: ఏదైనా ప్రభుత్వ అధికారి లం...

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం… పట్టభద్రుల MLC స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్

Image
  గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం… పట్టభద్రుల MLC స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్  నల్లగొండలో యువ ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్  రెండు వేలకు పైగా తరలివచ్చిన పట్టభద్రులు  నల్లగొండ, సెప్టెంబర్ 27 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని రత్న ఫంక్షన్ హాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా యువ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మెండెం కిరణ్ కుమార్ మాట్లాడుతూ… లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పట్టభద్రుల సమస్యలు తెలిసిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు చాలా రకాల సమస్యలు ఉన్నాయని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తనతో కలిసి ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువత అండతో విజయం సాధించి తీరుతానని మెండెం కిరణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు. యువత రాజకీయాల్లో రాణించాలి…విద్యావేత్త ప్రసన్న హరికృష్ణ  నిరుద్...

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

Image
ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా? హైదరాబాద్: మహాసభలో అక్రమాలు జరుగుతున్నాయని, జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం లేదని, సభ్యత్వ రుసుముల వసూళ్లలో దొంగ రసీదు బుక్కుల వ్యవహారం ఉందని ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “తస్మాత్ జాగ్రత్త” అంటూ ప్రక్షాళన కమిటీ చేసిన ఆరోపణలపై మహాసభ సంజాయిషీ నోటీసు జారీ చేయడం, ప్రక్షాళన కమిటీ లేవనెత్తిన అంశాలు అధికారికంగా స్పందించాల్సిన స్థాయికి చేరుకున్నాయనే సంకేతంగా భావించవచ్చు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలైంది. సంజాయిషీ నోటీసుతోనే వ్యవహారాన్ని ముగిస్తారా? లేక ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలను బయటపెడతారా? ముఖ్యంగా సంబంధిత జిల్లా కమిటీని రద్దు చేస్తారా? లేక కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? అన్నది ఇప్పుడు సామాన్య ఆర్యవైశ్యుడిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జిల్లా కమిటీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? ఆరోపణలు నిరాధారమని తేలితే దానిని అధికారికంగా ప్రకటిస్తారా? సభ్యత్వ రుసుముల వసూళ్లు, రసీదు బుక్కుల వ్యవహారంపై పూర్తి లెక్కలు, రికార్డులు బయటపెడతారా? ఇప్పటికే “పొరపాటు జరిగింది” అంటూ బా...

*అంగన్ వాడీల నుంచి మామూళ్లు.. రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన CDPO*

Image
 *అంగన్ వాడీల నుంచి మామూళ్లు.. రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన CDPO* *జగిత్యాల, సెప్టెంబర్ 26:* జగిత్యాల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ అధికారి అవినీతి బయటపడింది. మెట్ పల్లి CDPO ఏసీబీ వలలో చిక్కింది. *ఏసీబీ ప్రెస్ నోట్ నెం.144 ప్రకారం..* నిందితురాలు *దారోజు పద్మ, CDPO, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా* ను కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఈరోజు రూ.63,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* మెట్ పల్లి అర్బన్ మండలం పరిధిలోని 21 అంగన్ వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల రిమార్కులు రాయకుండా ఉండేందుకు CDPO పద్మ మామూళ్లు డిమాండ్ చేసింది. ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000/- చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీని ప్రకారం మూడు నెలలకు (రూ.3,000 x 21 కేంద్రాలు) మొత్తం రూ.63,000/- లంచం అడిగింది. ఫిర్యాదుదారుడి నుంచి తన కార్యాలయం ఆవరణ బయటే నేరుగా లంచం డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుండి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారిక సహాయం చేసేందుకు అక్రమంగా లబ్ధి పొందినట్లు ఏసీబీ నిర్ధారించింది....

నల్గొండ నుంచి న్యూయార్క్ వరకు డా. జగదీశ్వర్ రావు 46 ఏళ్ల ప్రయాణం

Image
   నల్గొండ నుంచి న్యూయార్క్ వరకు డా. జగదీశ్వర్ రావు 46 ఏళ్ల ప్రయాణం విద్యార్థి నాయకత్వం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా.. హార్వర్డ్ నుంచి అంతర్జాతీయ అకడమిక్ వేదికల వరకు హైదరాబాద్, సెప్టెంబర్ 24, 2026: నల్గొండ జిల్లాలో విద్యార్థి ఉద్యమాలతో ప్రారంభమైన డా. జగదీశ్వర్ రావు వీరనేని ప్రయాణం విద్య, సామాజిక ఉద్యమాలు, పరిశోధన, మీడియా, రాజకీయ-సామాజిక కార్యకలాపాలు, అంతర్జాతీయ అకడమిక్ సహకారం వంటి అనేక రంగాల్లో కొనసాగింది. సుమారు 46 ఏళ్ల ఈ ప్రయాణంలో విద్యార్థి నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, పరిశోధకుడిగా, ప్రొఫెసర్‌గా, విద్యా మాధ్యమాల పరిశోధకుడిగా ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. డా. జగదీశ్వర్ రావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా Educational Multimedia Research, Digital Media Research, Online మరియు Web-based Education రంగాల్లో బోధన, పరిశోధన చేస్తున్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ Educational Multimedia Research Centre (EMRC) డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 16 ఏళ్ల వయసులోనే విద్యార్థి నాయకత్వం నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల సామాజిక పరిస్థితులను స...

ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

Image
 *నల్గొండలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు* *నల్గొండ, సెప్టెంబర్ 27:* నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు *కట్టెల శివకుమార్* మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లను ఎదిరించి పోరాడిన గొప్ప ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె జీవితం నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నల్గొండ జిల్లా మహిళా డిగ్రీ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరును నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొండూరు సత్యనారాయణ, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బండారు శంకర్, కమ్మల నరేష్ కుమార్, సంఘం గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆదిమల్ల లింగయ్య, పెన్షనర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఎస్.కె. జానీమియా, జిల్లా నాయకులు ఈరిగి బిక్షం, కొండన్న, సుధీర్, నరేందర్ తదిత...

*NIMS అదనపు సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.6.13 కోట్ల అక్రమాస్తులు*

Image
 *NIMS అదనపు సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.6.13 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి* *హైదరాబాద్, సెప్టెంబర్ 22:* నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ అవినీతి బాగోతం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. *ఎవరిపై కేసు?* *నోరి లక్ష్మీ భాస్కర్ (56), తండ్రి సత్యనారాయణ, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్, NIMS, హైదరాబాద్.* నివాసం ఫ్లాట్ నెం.811, A బ్లాక్, కల్పతరు అపార్ట్ మెంట్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఉద్యోగంలో ఉండగా అక్రమ మార్గాల ద్వారా తన ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. అవినీతి నిరోధక చట్టం 13(1)(b) మరియు 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అతని నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మరో ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. *సోదాల్లో ఏం దొరికింది?* ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ చూస్తే దిమ్మతిరిగేలా ఉంది. దాదాపు *రూ.6.13 కోట్ల* విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ఇది డాక్యుమెంట్ విలువ మాత్రమే...

*బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు*

Image
 *బండ్లగూడ RTO ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు బట్టబయలు* *హైదరాబాద్, సెప్టెంబర్ 22:* బండ్లగూడలోని సౌత్ జోన్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు చేపట్టిన ఈ సర్‌ప్రైజ్ చెక్‌లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయంలోని సిబ్బంది సెల్‌ఫోన్లను పరిశీలించగా అనుమానాస్పద UPI లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా కార్యాలయం లోపల అనధికారికంగా ఏజెంట్లు సంచరిస్తూ దరఖాస్తులతో కనిపించడం ఏసీబీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏజెంట్ల వద్ద నుండి ఏకంగా రూ.24,760 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కొందరు అధికారులు ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయడానికి వాటిపై ప్రత్యేక సంకేతాలు, పేర్లు రాస్తున్నట్లు తేలింది. ఇలా చేస్తున్న వారిలో AOలుగా పనిచేస్తున్న బి.సునీత, ఎన్.హేమంత్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు మహ్మద్ ఇమ్రాన్, కె.సాయి కుమార్, జూనియర్ అసిస్టెంట్లు కె.బాబూజీ, టి.సాయికాంత్, అలాగే MA లతీఫ్ ఖాన్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అదనంగా సీనియర్ అసిస్టెంట్ స...

కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ!

Image
 కలంతోనే కాదు.. రక్తంతోనూ ప్రాణరక్షణ! టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినం సందర్భంగా బృహత్తర సేవా సంకల్పం • సెప్టెంబర్ 22న సంగారెడ్డి ఐబీలో భారీ రక్తదాన శిబిరం • ఉదయం 10:30 గంటలకు ప్రారంభం.. ప్రాణదాతలుగా నిలవాలని పిలుపు • "మన బలం.. మన కలం.. మన రక్తం.. ఒకరి ప్రాణం" నినాదంతో నిర్వహణ స్ఫూర్తి నినాదం: "మీరు చేసే ఒక్క రక్తదానం.. ఒక ప్రాణానికి పునర్జన్మ" "మన బలం.. మన కలం.. మన రక్తం.. ఒకరి ప్రాణం" సంగారెడ్డి : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే ఫైసల్, జిల్లా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఈ నెల సెప్టెంబర్ 22వ తేదీన సంగారెడ్డి స్థానిక ఐబీ (IB) ప్రాంగణంలో ఈ శిబిరం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది.   పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత కార్యక్రమంగా కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనే సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వా...

*నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి - రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్*

Image
 *నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ దాడి - రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు అరెస్ట్* *నిజామాబాద్, సెప్టెంబర్ 21:* నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ వలలో చిక్కారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న - *AO-1: పాల్ద అశోక్ - జూనియర్ అసిస్టెంట్ (ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్)* - *AO-2: కలకుంట్ల కిరణ్ కుమార్ - ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (ఆడిట్ సెక్షన్)* ఇద్దరినీ నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం 11.18 గంటలకు నిజామాబాద్ టౌన్ లోని రాజా రాజేంద్ర చౌరస్తా దగ్గర, సీతారాంనగర్ కాలనీలోని పద్మశాలి సంఘం వద్ద రూ.15,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఎందుకు లంచం అడిగారు?* ఫిర్యాదుదారుడి తల్లి సర్వీస్ బుక్ లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ తయారు చేసి, అవసరమైన ఎంట్రీలు చేసి నెలవారీ పెన్షన్ మంజూరు చేయడానికి ఈ లంచం డిమాండ్ చేశారు. అక్రమంగా రూ.15,000 లబ్ధి పొంది తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లిలోని II అడిషనల్ స్పెషల్ జడ్జి ఫర...

*గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం*

Image
 *గోవిందరావుపేట తహశీల్దార్ ఏసీబీ వలలో.. రూ.14 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం* *ములుగు జిల్లా, సెప్టెంబర్ 18:* ములుగు జిల్లాలో అవినీతి అధికారి ఆట కట్టించింది ఏసీబీ. గోవిందరావుపేట మండల తహశీల్దార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు గోవిందరావుపేట MRO ఆఫీసులో దాడి చేసి తహశీల్దార్ *నెల్లుట్ల సృజన్ కుమార్* ను పట్టుకున్నారు. *అసలేం జరిగింది?* ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత పేరు మీద పూర్వీకుల వ్యవసాయ భూమిని వారసత్వంగా మార్చేందుకు (Succession) తహశీల్దార్ రూ.15,000 లంచం అడిగాడు. బేరం ఆడాక రూ.14,000 కు ఒప్పుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. ఈరోజు రూ.14,000 తీసుకుంటుండగా తహశీల్దార్ ను పట్టుకున్నారు. లంచం డబ్బును కుడి చేతితో తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అతని చేతివేళ్లకు కెమికల్ టెస్ట్ చేయగా పింక్ కలర్ గా మారి పాజిటివ్ వచ్చింది. నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ

Image
 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ఏబీవీపీ మిర్యాలగూడ: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరులను, వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మిర్యాలగూడ టౌన్ వైస్ ప్రెసిడెంట్ వంశీ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. గత చరిత్ర మనకు ధైర్యంగా నిలబడటం, అన్యాయాన్ని ఎదుర్కోవడం, సమాజం పట్ల బాధ్యతగా ఉండటం వంటి విలువలను నేర్పిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ బాధ్యతను గుర్తించి మంచిగా చదువుకుంటూ, సమాజానికి మరియు దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరుణ్, నాగరాజు, వెంకట్, పార్థు తదితరులు పాల్గొన్నారు.

రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

Image
 *రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్* *ఖమ్మం, సెప్టెంబర్ 17:* ఖమ్మం జిల్లాలో మరో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. *ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడి* చర్ల మండలం సత్యనారాయణపురం లోని *ఎస్టీ బాయ్స్ హాస్టల్ (ఐటీడీఏ)* లో వార్డెన్ గా పనిచేస్తున్న *భూక్యా వాల్ సింహ* తన హాస్టల్ లో పనిచేసే వర్కర్ (కుక్) జీతం బిల్లు చేయడానికి రూ.14,000/- లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి, ఈరోజు వార్డెన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల నుండి కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో వరుస దాడులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

*చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్*

Image
 *చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడి - రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అరెస్ట్* *రంగారెడ్డి, సెప్టెంబర్ 17, 2026:* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లంచం తీసుకుంటూ సబ్-ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ కథనం ప్రకారం..* చేవెళ్ల డివిజనల్ సబ్-ట్రెజరీ ఆఫీస్ లో పనిచేస్తున్న - *AO-1: మాదిగ లక్ష్మయ్య - సబ్-ట్రెజరీ ఆఫీసర్* - *AO-2: కావలి అనూరాధ - అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్* ఒక ఉద్యోగి సస్పెన్షన్ కాలపు జీతం బిల్లులు రూ. 23,25,390/- మరియు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బకాయిలు రూ. 4,29,000/- ప్రాసెస్ చేసినందుకు గాను రూ. 2,50,000/- లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా రూ. 1,00,000/- తీసుకుంటుండగా ఏసీబీ రంగారెడ్డి రేంజ్ అధికారులు వల వేసి పట్టుకున్నారు. AO-1 లక్ష్మయ్య రూ. 50,000/- నేరుగా తీసుకోగా, AO-2 అనూరాధ చెప్పడంతో మిగిలిన రూ. 50,000/- ను *A3: వడ్డే జంగయ్య @ చిన్న (ప్రైవేట్ వ్యక్తి)* తీసుకున్నాడు. ఇద్దరి నుండి లంచం సొమ్మును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ముగ్గ...

*టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం*

Image
 *టీజీపీసీబీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం* *సనత్‌నగర్, సెప్టెంబర్ 17:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) సనత్‌నగర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని దేశభక్తి, గౌరవభావంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 చారిత్రక ప్రాధాన్యతను, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను గుర్తుచేశారు. తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని పేర్కొన్నారు. *పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి: చైర్మన్* అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని చైర్మన్ అన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భ...

*ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకే ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి*

Image
* ప్రక్షాళన కమిటీ విజయం - పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవన్ ఉపయోగపడాలన్న సీఎం రేవంత్ రెడ్డి* *హైదరాబాద్:* ఉప్పల్ భగాయత్ లో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ భూమి పూజ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్యవైశ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని *మహాసభ ప్రక్షాళన కమిటీ తొలి విజయం* గా చెప్పుకోవచ్చు. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి *"నిర్మిస్తున్న ఈ ఆత్మగౌరవ భవన్ పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఉపయోగపడాలి. ఆర్యవైశ్యులంతా కలిసి ఉండండి, రాజకీయాల్లో రాణించండి"* అని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఆర్యవైశ్యులు పేదలకు ఎలాంటి పూచీ లేకుండా ఉద్దెర ఇచ్చి ఆదుకుంటారని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ ఆర్యవైశ్యలకే ఇచ్చామని తెలిపారు. ఆత్మగౌరవ భవన్ కు ఆర్థిక సహాయం కోరారని, నిబంధనల మేరకు చేస్తామని తెలిపారు. *ఎందుకు ఇది ప్రక్షాళన కమిటీ విజయం?* గత కొన్ని నెలలుగా మహాసభ ప్రక్షాళన కమిటీ లేవనెత్తుతున్న ప్రధాన డిమాండ్ ఇదే. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న భవన్ కేవలం కొందరు పెద్దలకోసం, ఫంక్షన్ హాల్ గా మిగిలిపోకుండా.. ప...

ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post వైరల్ అవుతుంది 👇👇👇👇👇

Image
ఉప్పల్ bhagayath భూమి పూజకు రేవంతన్న రావడం వ్యతిరేకిస్తున్నాం అన్న Instagram post మస్తు వైరల్ అవుతుంది మరి ఈ పోస్ట్ రేవంత్ రెడ్డి కి చేరేనా? ఆలోచించినా అన్న డిస్కస్ పెరుగుతుంది 👇👇👇👇👇 ఈ క్రింది లింక్ టచ్ చేసి చూడొచ్చు https://www.instagram.com/reel/DdLsIJmRH1a/?stkn=MWw1eWMzaXpjd2pjYg==  

*CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో*

Image
 *CMRF మెడికల్ బిల్లు కోసం రూ.లక్ష లంచం - సెక్రటేరియట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, TSIDC సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలలో* *హైదరాబాద్, సెప్టెంబర్ 10:* ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మెడికల్ రీయింబర్స్ మెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. తెలంగాణ సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న *ఆనందేశి రాఘవేందర్ (A-1)* మరియు TSIDC (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పరిశ్రమ భవన్, బషీర్ బాగ్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న *మేడి వినోద్ (A-2)* లను బుధవారం సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి CMRF మెడికల్ రీయింబర్స్ మెంట్ క్లెయిమ్ ను ప్రాసెస్ చేసి, మంజూరైన రూ.2 లక్షలకు చెక్కు ఇప్పించి, మిగిలిన క్లెయిమ్ ను కూడా ప్రాసెస్ చేసేందుకు A-1 రాఘవేందర్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అంతకు ముందే PhonePe ద్వారా A-2 వినోద్ ద్వారా రూ.5,000 లంచం తీసుకున్నాడు. ఏసీబీ వల వేయగా ఫిర్యాదుదారుడి నుంచి A-2 వినోద్ రూ.లక్ష తీసుకుని A-1 రాఘవేందర్ కు అందజేశాడు. రాఘవేందర్ వద్ద నుంచి ఆ తడిసిన రూ.లక్ష నోట్లను ఏసీ...

*నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి*

Image
 *నల్గొండలో వినాయక ఉత్సవాలకు పోలీసుల సూచనలు - ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి* *నల్లగొండ:* వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. శాంతి సంఘ సభ్యులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. - ప్రతి గణేష్ మండపాన్ని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. - ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా మద్యం సేవించడం, డ్రంక్ డ్రైవింగ్ వంటివి చేయరాదు. - ఫేక్ న్యూస్, వదంతులు, రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు. అలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. - నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. - డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలి. - ఇతరుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దు. *"ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుందాం. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం"* అని డీఎస్పీ శివరాం రెడ్డి విజ్ఞప్తి చే...

*మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం*

Image
  *మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం* *రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన భరతక్క, వనజక్కలకు సత్కారం* *వరంగల్, తేదీ:* ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నేపథ్యంలో, రైతుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రజా ఉద్యమ నేత అక్కరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ సతీమణి సింగు సిరిష అలియాస్ భరతక్క, సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి పటేల్ వనజ అలియాస్ కాపురి వనజక్కలను ఈ సందర్భంగా సత్కరించారు.         ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మేరు సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రాము, జిల్లా నాయకులు రాయబారు సంతోష్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగా వెంకటరాజం మాట్లాడుతూ... "మేరు జాతిలో పుట్టి రైతుల హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కో...

*కాలేజీ అఫిలియేషన్ కోసం రూ.20 వేలు లంచం - ఏసీబీ వలలో సంగారెడ్డి DIEO*

Image
 *కాలేజీ అఫిలియేషన్ కోసం రూ.20 వేలు లంచం - ఏసీబీ వలలో సంగారెడ్డి DIEO* *సంగారెడ్డి, సెప్టెంబర్ 9:* ప్రైవేట్ కాలేజీ అఫిలియేషన్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) ఏసీబీ వలలో చిక్కాడు. జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ *శ్రీ రామావత్ గోవింద్ రామ్* ను మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడికి చెందిన *వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ, సంగారెడ్డి* కి ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు కోసం ఇన్ స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపేందుకు DIEO గోవింద్ రామ్ మొదట రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ.30,000 తీసుకున్నాడు. మిగిలిన రూ.20,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు వల వేసి రూ.20,000 లంచం తీసుకుంటుండగా DIEO ను పట్టుకున్నారు. తడిసిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ నిర్ధారించింది. నిందితుడిని అరెస్టు చేసి హైదర...

ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు

Image
  ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు నారాయణపేటలో సబ్‌ రిజిస్ట్రార్.. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ అరెస్ట్ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒకే రోజు రెండు వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ అధికారులపై చర్యలు చేపట్టింది. నారాయణపేట జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్‌, హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. రూ.90 వేల లంచం డిమాండ్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ నారాయణపేట జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకట్‌ స్వామిపై క్రిమినల్‌ మిస్‌కండక్ట్‌ కేసు నమోదైంది. ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నంబర్‌ 4723/2026ను పూర్తి చేసేందుకు రూ.90,000 లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో భాగంగా రూ.50,000ను ప్రైవేట్‌ వ్యక్తి కమ్మరి నాగేష్‌ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం మిగిలిన రూ.40,000 కోసం డిమాండ్‌ చేసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేట్‌ వ్యక్తి కమ్మరి నాగేష్‌న...

*జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్*

Image
 *జైల్లో ములాఖత్ కోసం రూ.10 వేలు లంచం - ఏసీబీ వలలో హుజూరాబాద్ జైలర్* *కరీంనగర్, సెప్టెంబర్ 7:* రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించి, ములాఖత్ లు ఇప్పించేందుకు, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబ్ జైలు జైలర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్ గా పనిచేస్తున్న *N. దేవేందర్  (46) (A-1)* ను, అతని అనుచరుడు ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ *రావుల హరీష్ (30) (A-2)* ను కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు ట్రాప్ చేశారు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి మామ రిమాండ్ ఖైదీగా హుజూరాబాద్ సబ్ జైలులో ఉన్నాడు. అతనికి మెరుగైన వసతులు కల్పించడం, కుటుంబ సభ్యులను కలిసేందుకు ములాఖత్ సౌకర్యం కల్పించడం, ఖమ్మం జైలుకు బదిలీ చేయకుండా చూడడం కోసం జైలర్ దేవేందర్ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. లంచాన్ని నేరుగా తీసుకోకుండా పెట్రోల్ బంక్ ఆపరేటర్ హరీష్ ద్వారా తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేశారు. హుజూరాబాద్ లోని ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ వద్...

*బ్లూ స్కైస్ కోసం క్లీన్ ఎయిర్ డే - పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలి: TGPCB*

Image
 *బ్లూ స్కైస్ కోసం క్లీన్ ఎయిర్ డే - పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలి: TGPCB* *హైదరాబాద్, సెప్టెంబర్ 7:* అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి - నీలి ఆకాశం దినోత్సవం (International Day of Clean Air for Blue Skies) సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), టోరెంట్ గ్యాస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TGPCB జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి అనేది కేవలం పర్యావరణ లక్ష్యం మాత్రమే కాదు, అది ప్రజారోగ్యం, ఆర్థిక, అభివృద్ధి ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. పరిశ్రమలు క్లీన్ టెక్నాలజీ, ప్రజా రవాణా, ఇంధన సామర్థ్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులను కేవలం నిబంధనలకు అనుగుణంగా చేసే ఖర్చుగా కాకుండా అభివృద్ధి పెట్టుబడులుగా చూడాలని సూచించారు. TGPCB సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డా. డి. ప్రసాద్ మాట్లాడుతూ వ్యక్తుల నుంచి సంస్థల వరకు అందరి నిబద్ధత అవసరమని, గాలి నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమలు నె...

*మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - TGPCB ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్క్‌షాప్*

Image
  *మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - TGPCB ఆధ్వర్యంలో విద్యార్థులకు వర్క్‌షాప్* *హైదరాబాద్, సెప్టెంబర్ 7:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఆధ్వర్యంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై అవగాహన వర్క్‌షాప్  సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఐదు పాఠశాలలకు చెందిన 108 మంది విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. TGPCB మెంబర్ సెక్రటరీ జి. రవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని సూచించారు. మట్టి విగ్రహాలు నీటిలో సహజంగా కరిగిపోవడం వల్ల నీటి వనరుల కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. విగ్రహాల నిమజ్జనాన్ని నిర్దేశించిన చెరువులు, సరస్సుల్లోనే చేపట్టాలని కోరారు. విద్యార్థులు ఈ అవగాహనను తల్లిదండ్రులు, సమాజానికి తెలియజేసి పర్యావరణహిత వినాయక చవితి సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. *రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం* పర్యావరణహిత వినాయక చవితిపై TGPCB ఆటోల ద్వారా, పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేపడుతోంది. రాష్ట్రవ్యాప్త...

*క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట – ప్రతిభను చాటుతున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులు* - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 *క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట – ప్రతిభను చాటుతున్న తెలంగాణ బ్యాడ్మింటన్ క్రీడాకారులు* - ఉప్పల శ్రీనివాస్ గుప్త *గోపీచంద్, సైనా నెహ్వాల్‌లను ఆదర్శంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి* - *ఉప్పల శ్రీనివాస్ గుప్త* *జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు* తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ నేషనల్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన YONEX-SUNRISE G.H. RAISONI MEMORIAL 5వ తెలంగాణ స్టేట్ మినీ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2026కు ముగింపు కీ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 280 మంది చిన్నారులు, యువ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను చ...

*తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక*

Image
  *తెలంగాణ మేర కుల రాష్ట్ర కమిటీ ఎన్నిక* *హైదరాబాద్, సెప్టెంబర్ 4:* బాగ్‌లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నాడు మేర కుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ మేర సంఘం రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఆటంకాలతో పరిష్కారం కాని ఎన్నికల సమస్యను సభ్యుల సహకార, సమన్వయంతో ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది.  అధ్యక్షుడిగా కీర్తి రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా శీలం కోటి రవి, గౌరవ అధ్యక్షులు గా కరాటే కృష్ణ, కోశాధికారిగా సింగు విష్ణు, జాయింట్ సెక్రెటరీ మరియు అధికార ప్రతినిధి గా మునగాల రాము గార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  తెలంగాణ రాష్ట్ర మేర కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకటరాజం , వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ గార్ల ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, జోన్లు, పట్టణాల నుంచి మేర సంఘాల మాజీ, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు, పెద్దలు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ సంఘ వెంకట రాజ్యం మాట్లాడుతూ సమన్వయంతో జాతిని ఏకం చేసేవాడే, వివాదాలకు దూరంగా ఉండేవాడే నిజమైన నాయకుడని అన్నార...

*సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు*

Image
  *సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.3.54 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు* *సూర్యాపేట, సెప్టెంబర్ 3:* ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కోదాడ మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ టీపీఓ *వుయ్యాల సోమయ్య* పై ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇల్లు, ఆఫీసు, బంధువులు, అనుచరులకు సంబంధించిన మొత్తం 7 చోట్ల సోదాలు నిర్వహించారు. *సోదాల్లో బయటపడిన ఆస్తులు:* - సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి - విలువ రూ.2,94,000 - సూర్యాపేట, హయత్‌నగర్ పరిధిలో 5 నివాస భవనాలు (G+1, G+2, G+4 + పెంట్ హౌస్, 2 గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు) - విలువ రూ.2,75,00,000 - సూర్యాపేట పరిధిలో 8 ఓపెన్ ప్లాట్లు - విలువ రూ.2,58,500. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని అధికారులు తెలిపారు. - నగదు రూ.4,63,990 - బ్యాంకు బ్యాలెన్స్ రూ.13,00,000 - 709 గ్రాముల బంగారు ఆభరణాలు, 1750 గ్రాముల వెండి ఆభరణాలు - విలువ సుమారు రూ.20,00,000 - 2 ఫోర్ వీలర్లు, 3 టూ వీలర్లు - విలువ రూ.25,20,000 - గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు - ...

*పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్*

Image
 *పోడు సాగు కోసం రూ.30 వేలు లంచం - ఏసీబీ వలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్* *భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3:* పోడు సాగును అడ్డుకోకుండా, కందకాలు తవ్వకుండా ఉండేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లాపల్లి మండలం, కచనపల్లి బీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు రామానుజగూడెం బీట్ ఇన్‌చార్జ్ గా ఉన్న *బానోత్ రవి కుమార్ (A-1)* ను ఏసీబీ అధికారులు బుధవారం ట్రాప్ చేశారు. ఫిర్యాదుదారుడి పోడు వ్యవసాయాన్ని అడ్డుకోకుండా, భవిష్యత్తులో పట్టా/రెగ్యులరైజేషన్ వచ్చేలా సహకరిస్తానని చెప్పి రవి కుమార్ రూ.30,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం నేరుగా తీసుకోకుండా తన మనిషి *పఠాన్ సాదిక్ ఖాన్ (A-2)* కు ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి చెప్పాడు. ఏసీబీ పథకం ప్రకారం ఫిర్యాదుదారుడు రామానుజగూడెం గ్రామంలోని సాదిక్ ఖాన్ నివాసంలో రూ.30 వేలు అందజేశాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. A-2 చేతులపై నిర్వహించిన కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. A-1 అధికార దుర్వినియోగానికి పాల్పడి A-2 ద్వారా లంచం తీసుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరు నింద...

*ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత*

Image
 *ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* లంచం డిమాండ్ చేసిన టోలిచౌకీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. గోల్కొండ జోన్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టోలిచౌకీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ *ఆర్. పాండు నాయక్* రూ.10,000 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అతనిపై కేసు నమోదు చేయకుండా, కుటుంబ సభ్యుల మధ్య విషయాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు, అతని పాస్‌పోర్టును సీజ్ చేయకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పి ఎస్ఐ పాండు నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడి నుండి తడిసిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచినట్లు ప...

*టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు*

Image
 *టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) లో 11 సంవత్సరాల పాటు సెక్యూరిటీ పర్సన్ గా నిబద్ధతతో సేవలందించిన వై. భాస్కర్ చారి పదవీ విరమణ సందర్భంగా సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ చారి అందించిన సేవలను అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. ఆయనను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ అనంతర జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (OUSEA) అధ్యక్షుడు సి. మధు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ గౌడ్, రాజా రమేష్, బాబు గౌడ్, రఘు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

*ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్*

Image
 *ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు సైఫాబాద్ లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ గ్యారెంటీకి, విశ్వాసానికి, ఆర్థిక భద్రతకు ప్రతీక అని, 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని శతాబ్ది వైపు సాగాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం ఏళ్లుగా ఎల్‌ఐసీతో అనుబంధం కలిగి ఉందని తెలిపారు. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణ అందించడమే లక్ష్యమని, ఏడు దశాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసాన్ని నిలబెట్టుకున్న సంస్థ ఎల్‌ఐసీ అని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు బీమా వారోత్సవాలు జరుగుతా...

*స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* - సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ

Image
  *స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారత్‌ను విశ్వగురువుగా మలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిపాదించిన పంచపరివర్తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉత్తమ భారతీయ సమాజాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందని సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో "సమాచార భారతి" సంస్థ ఆధ్వర్యంలో ''స్థానిక పత్రికలు - సమాజ నిర్మాణం'' అంశంపై ఆదివారం జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు. సంఘ్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ జీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా వివిధ స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు. సంఘం ప్రధానంగా మార్పును, పరిణామాన్ని కోరుతున్నదని, ఇవి వ్యక్తి నుంచి ప్రారంభం కావాలని, దేశ నిర్మాణం లక్ష్యంగా ఇటువంటి వ్యక్తి నిర్మాణం అనేది సంఘ్ శాఖలలో జరుగుతున్నదని భరత్ కుమార్ వివరించారు. ఇలాంటి వ్యక్తులతో కూడిన కుటుంబమే దేశానికి వెన్నెముక అన్నారు. సంఘ్ ప్రస్తుతం 90 వేల...