Posts

రేషన్ దొంగల పై పి డి యాక్ట్ - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 రేషన్ దొంగల పై పి డి యాక్ట్  - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  Nalgonda:  రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అలవాటు పడిన వారి పై పి డి యాక్ట్ నమోదు చేస్తున్నట్టు, పి డి ఎస్ కేసుల్లో ఎక్కువ మార్లు పట్టుబడిన వాహనాల జప్తు కు సైతం సిఫారసు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యం అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసే దందా చేస్తున్నారని చెప్పారు. ఒకే వాహనాన్ని ఎక్కువ మార్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు ఉపయోగిస్తే ఆ వాహనం నడిపిన వ్యక్తి లైసెన్స్ రద్దు కు సిఫారసు చేస్తానని మాచన రఘునందన్ హెచ్చరించారు.సన్న బియ్యం ను కూడా కొంతమంది వద్ద అధిక ధరకు కొని అమన్ గల్, కడ్తాల్ మీదుగా..మహేశ్వరం, శంషాబాద్ , హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.ఈ అక్రమ రవాణా కు పటిష్ట నిఘా తో చెక్ పెట్టనున్నట్టు వివరించారు.కొన్ని పోలీస్ స్టేషన్ల లో ఒక్కో వ్యక్తి పై పది కేసులు న...

రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  Nalgonda:  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే రేషన్ షాపుల్లో .. రేషన్ రసీదు ను ప్రజలు అడిగి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన మర్రిగూడ లో చౌక దుకాణాల ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు రేషన్ తీసుకున్నాక రేషన్ తాలుకు రసీదు కూడా అడిగి తీసుకోవాలని సూచించారు.జాతీయ ఉస్పత్తి పథకం లో.. పారాదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సాంకేతిక మార్పులు వచ్చాయన్నారు. ఐనా కానీ ప్రజలు చౌక దుకాణాల నుంచి రేషన్ వస్తే చాలు అన్న చందాన రసీదు లు అడిగి తీసుకోవడం లో ఆసక్తి చూపెట్టక"పోవడం" వల్ల రేషన్ లో అక్రమాలు జరిగేందుకు అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.లబ్ది దారులు ఎంత జాగరూకత గా ఉంటే..అన్ని మోసాలను , అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని రఘునందన్ స్పష్టం చేశారు.కొందరు డీలర్లు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి, అన్ని సరకులు ఇచ్చినట్టు రసీదు తీసి, జనం అడగటం లేదు కదా అని తమ వద్దే పెట్టుకున్నారని రఘునందన్ ఆక్షేప...

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

Image
  తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు తెలంగాణా భాష దినోత్సవంగా పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి. హైద్రాబాద్:  మన భాషే మన ఊపిరి ప్రజా కవి కాళోజీ జన్మ దినం.ఈ పర్వ దినాన్ని తెలంగాణా భాష దినోత్సవంగా జేసుకొని సంబరాలు పడుతున్నాం.మన"బాష బడి పలుకుల భాష” మాత్రేమ కాదు “పలుకు బడుల బాష”గా గౌరవం పొందే రోజు రావాలని కాళోజీ యెంతగానో తపన పడ్డాడు. అందు కోసమే తన ప్రతి రాతల ఆ భాషకు కావ్య గౌరవం దక్కేటట్టు రాసుకొచ్చిండు.ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీజిపీసీబీ) కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది కాళోజి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కాళోజి గారి తెలంగాణ సాహిత్యం, స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సేవలో చేసిన విశిష్టమైన కృషిని స్మరించుకున్నారు. ఆయన రచనలు సామాన్య ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ, మానవతా విలువలు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయని గుర్తుచేశారు. కాళోజి గారి జీవన విధానం, నిస్వార్థ సేవా తత్త్వాన్ని అభినందిస్తూ, ...

ACB వలలో టౌన్ ప్లానింగ్ అధికారి - 4లక్షల లంచం

Image
 నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు: టౌన్ ప్లానింగ్ అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నార్సింగి మున్సిపల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB) నర్సింగి మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం, ముంచిరేవుల నివాసి వినోద్ తన ప్లాట్ యొక్క LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) క్లియర్ చేయడానికి ఆమె ₹10 లక్షలు లంచం డిమాండ్ చేసింది. ఈరోజు లంచం యొక్క మొదటి విడతగా మణిహారిక ₹4 లక్షలు స్వీకరించిందని, ఆ సమయంలో ACB బృందం వేగంగా చర్య తీసుకుని ఆమెను అరెస్టు చేసిందని వర్గాలు తెలిపాయి.

*వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్*

Image
 *వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తాం* *...నీట్ పేరెంట్స్ అసోసియేషన్* *హైదరాబాద్:* వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణచారి అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని ఎల్బీనగర్ శ్రీ రామచంద్ర మిషన్ వెల్నెస్ సెంటర్లో రాష్ట్రస్థాయి నీట్ పేరెంట్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా మల్లోజు సత్యనారాయణచారి, , ప్రధాన కార్యదర్శిగా పొడిశెట్టి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా బొడ్డుపల్లి అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  అలాగే జాయింట్ సెక్రెటరీలుగా దొడ్డేపల్లిరఘుపతి, రాజుగౌడ్, చీఫ్ అడ్వైజర్ గా బీరెల్లి కమలాకర్ రావు, కోశాధికారిగా ఎం . శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్. భాస్కర్ రావు, కే. రవి కుమార్, పి. సుజాత, కార్యవర్గ సభ్యులుగా గడ్డం స్వప్న, పబ్బం మానస, కే నరహరి, టి. రత్న ప్రసాద్, నరేందర్ రెడ్డి లను  ఎన్నుకోవడం జరిగింది.సుమారు 1000 మంది వరకు పాల్గొన్న ఈ సమావేశంలో వైద్య విద్యార్థులకు స్థానికత కల్పి...

ధనా..ధన్ రఘునందన్ ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలే

Image
 ధనా..ధన్ రఘునందన్ ప్రజా పంపిణీ బియ్యం తో దందా చేస్తే అరదండాలేనని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం నాడు మాల్ నుంచి చింతపల్లి వరకు విస్తృత ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కిరాణా దుకాణాలు,రైస్ మిల్లుల ను రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న అనుమానం తో చెక్ చేసినట్టు చెప్పారు.రేషన్ ఎక్కడ దాచి పెట్టినా వెలికి తీసి కేసు నమోదు చేయడం ఖాయం అని  మార్వాడి లకు గట్టి వార్నింగ్ ఇచ్చానన్నారు.రేషన్ బియ్యం దందా చేస్తే అరదండాలే అని హెచ్చరించారు.ఆయా రైస్ మిల్లు ల్లో ఉన్న బియ్యం నిల్వలను చెక్ చేశారు.రైస్ మిల్లు ల్లో ధాన్యం మర పట్టిన వివరాలు పొందుపరచాలని సూచించారు.

ఏసీబీ వలలో ఒకే రోజు ఇద్దరు

Image
  ఏసీబీ వలలో ఒకే రోజు ఇద్దరు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని సీనియర్ అసిస్టెంట్, ఐ/సి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ నెట్‌లో ఉన్నారు. 03-09-2025న, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్ మరియు ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నిందితుడు (AO), కర్ణ శ్రీనివాస్ రావు ఫిర్యాదుదారుడి నుండి ₹7,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ACB అధికారులు అరెస్టు చేశారు. ప్రారంభంలో, AO ₹10,000 డిమాండ్ చేశారు, కానీ తరువాత అధికారిక అనుకూలంగా వ్యవహరించడం కోసం అంటే "VLT ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించడం, VLT నంబర్‌ను కేటాయించడం మరియు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ఫిర్యాదుదారుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడం" కోసం ₹7,000 కు తగ్గించారు. AO వద్ద నుండి ₹7,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనవసర ప్రయోజనం పొందడానికి AO తన విధులను నిర్వర్తించడంలో అనుచితంగా మరియు నిజాయితీగా వ్యవహరించాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి గుర్తింపును నిలిపివేశారు. అందువల్ల, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఐ/సి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన ఎఓ ...