తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీ జి పీ సీ బీ) లో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
తెలంగాణా భాష దినోత్సవంగా పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి.
హైద్రాబాద్:
మన భాషే మన ఊపిరి ప్రజా కవి కాళోజీ జన్మ దినం.ఈ పర్వ దినాన్ని తెలంగాణా భాష దినోత్సవంగా జేసుకొని సంబరాలు పడుతున్నాం.మన"బాష బడి పలుకుల భాష” మాత్రేమ కాదు “పలుకు బడుల బాష”గా గౌరవం పొందే రోజు రావాలని కాళోజీ యెంతగానో తపన పడ్డాడు. అందు కోసమే తన ప్రతి రాతల ఆ భాషకు కావ్య గౌరవం దక్కేటట్టు రాసుకొచ్చిండు.ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతిని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీజిపీసీబీ) కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది కాళోజి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. కాళోజి గారి తెలంగాణ సాహిత్యం, స్వాతంత్ర్య పోరాటం, సామాజిక సేవలో చేసిన విశిష్టమైన కృషిని స్మరించుకున్నారు. ఆయన రచనలు సామాన్య ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ, మానవతా విలువలు, సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయని గుర్తుచేశారు.
కాళోజి గారి జీవన విధానం, నిస్వార్థ సేవా తత్త్వాన్ని అభినందిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ పర్యావరణ పరిరక్షణకు, ప్రజల అవగాహన పెంపు దిశగా కృషి చేయాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (జె సి ఇ ఇ), డి.కృపానంద్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ వినయ్ కుమార్ నాయుడు మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.నాగేశ్వర రావు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment