రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్


 రేషన్ రసీదు అడిగి తీసుకోండి - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ 

Nalgonda: 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహించే రేషన్ షాపుల్లో .. రేషన్ రసీదు ను ప్రజలు అడిగి తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన మర్రిగూడ లో చౌక దుకాణాల ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు రేషన్ తీసుకున్నాక రేషన్ తాలుకు రసీదు కూడా అడిగి తీసుకోవాలని సూచించారు.జాతీయ ఉస్పత్తి పథకం లో.. పారాదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సాంకేతిక మార్పులు వచ్చాయన్నారు. ఐనా కానీ ప్రజలు చౌక దుకాణాల నుంచి రేషన్ వస్తే చాలు అన్న చందాన రసీదు లు అడిగి తీసుకోవడం లో ఆసక్తి చూపెట్టక"పోవడం" వల్ల రేషన్ లో అక్రమాలు జరిగేందుకు అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.లబ్ది దారులు ఎంత జాగరూకత గా ఉంటే..అన్ని మోసాలను , అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని రఘునందన్ స్పష్టం చేశారు.కొందరు డీలర్లు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి, అన్ని సరకులు ఇచ్చినట్టు రసీదు తీసి, జనం అడగటం లేదు కదా అని తమ వద్దే పెట్టుకున్నారని రఘునందన్ ఆక్షేపించారు.లబ్ది దారులకు రేషన్ రసీదు ఇవ్వడం కూడా నియమ నిబంధనల్లో భాగమే అని రఘునందన్ స్పష్టం చేశారు.ఉద్దేశ్యపూర్వకంగా లబ్ది దారులకు రేషన్ రసీదు ఇవ్వని డీలర్ ల పై చర్య తీసుకునే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం