PCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం


 


PCB ఆధ్వర్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవం.


హైద్రాబాద్: 


ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2025ను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) 2025 సెప్టెంబర్ 16న సనత్నగర్లోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించింది.


ఈ సంవత్సరం యొక్క థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా ఓజోన్ను క్షీణింపజేసే రసాయనాలను నిర్మూలించడం, ఓజోన్ పొర రక్షణ ప్రజలకు తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యం.


టి జి పి సి బి సభ్య కార్యదర్శి  రవి మాట్లాడుతూ “భూమిని సూర్యుని నుండి వచ్చే హానికర అల్ట్రావయొలెట్ కిరణాల నుండి కాపాడే రక్షాకవచంలా, ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్ లోని క్రింది భాగంలో ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్లు (CFCs), హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్లు (HCFCs) వంటి రసాయనాలు ఓజోన్ పొరను క్షీణింపజేస్తాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్, కంటి ముత్యంబిందు వంటి వ్యాధులు వస్తాయి. ఓజోన్ పొరను రక్షించడానికి చెట్లు నాటడం, పర్యావరణానుకూల ఉత్పత్తులను ఉపయోగించడం, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం అవసరం. ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలను నిర్మూలించడం, ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం. ఈ ప్రయత్నం ఇప్పటికే చాలా మంచి ఫలితాలు ఇచ్చింది అని టి జి పి సి బి సభ్య కార్యదర్శి  రవి పేర్కొన్నారు.


“స్ట్రాటోస్ఫియర్లోని ఓజోన్ పొర అల్ట్రావయొలెట్ కిరణాలను భూమికి చేరకుండా అడ్డుకొని క్యాన్సర్, చర్మ వ్యాధులు, కంటి ముత్యంబిందు వంటి సమస్యల నుండి మనలను రక్షిస్తుంది. అయితే, ట్రోపోస్ఫియర్లో (భూమికి దగ్గరగా) ఉన్న ఓజోన్ మాత్రం కార్బన్ డయాక్సైడ్లా ప్రవర్తించి, గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. దీని వలన భూ ఉష్ణోగ్రత పెరిగి, వృక్షజాలం మరియు జంతుజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.” అని వివరించారు.


పర్యావరణ శాస్త్రవేత్త డా. నాగేశ్వర రావు ఓజోన్ క్షీణత , పర్యావరణంపై కలిగే హానికర ప్రభావo గురించి వివరించారు.


 ఈ సందర్భంగా ఓజోన్ను క్షీణింపజేసే రసాయనాలు, మాంట్రియల్ ప్రోటోకాల్పై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు.


విద్యార్థులు, ఉపాధ్యాయులు, టి జి పి సి బి శాస్త్రవేత్తలు, సీనియర్ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం