రేషన్ దొంగల పై పి డి యాక్ట్ - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
రేషన్ దొంగల పై పి డి యాక్ట్ - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్
Nalgonda:
రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అలవాటు పడిన వారి పై పి డి యాక్ట్ నమోదు చేస్తున్నట్టు, పి డి ఎస్ కేసుల్లో ఎక్కువ మార్లు పట్టుబడిన వాహనాల జప్తు కు సైతం సిఫారసు చేస్తానని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ఆయన నాంపల్లి లో మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యం అక్రమార్కులు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అధిక ధరకు కొనుగోలు చేసే దందా చేస్తున్నారని చెప్పారు. ఒకే వాహనాన్ని ఎక్కువ మార్లు రేషన్ బియ్యం అక్రమ రవాణా కు ఉపయోగిస్తే ఆ వాహనం నడిపిన వ్యక్తి లైసెన్స్ రద్దు కు సిఫారసు చేస్తానని మాచన రఘునందన్ హెచ్చరించారు.సన్న బియ్యం ను కూడా కొంతమంది వద్ద అధిక ధరకు కొని అమన్ గల్, కడ్తాల్ మీదుగా..మహేశ్వరం, శంషాబాద్ , హైదరాబాద్ కు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ ఆక్షేపించారు.ఈ అక్రమ రవాణా కు పటిష్ట నిఘా తో చెక్ పెట్టనున్నట్టు వివరించారు.కొన్ని పోలీస్ స్టేషన్ల లో ఒక్కో వ్యక్తి పై పది కేసులు నమోదై ఉన్నాయని మాచన రఘునందన్ వివరించారు.అటువంటి వారి జాబితా ను జిల్లా పోలీసు అధికారి కి పంపి,హ్యాబిట్యుయేటెడ్ క్రిమినల్ గా పోలీసు రికార్డు ల్లో పొందుపరచే అవకాశం లేకపోలేదని రఘునందన్ అన్నారు.ఇక నైనా రేషన్ అక్రమ రవాణా దందా కు స్వస్తి పలకాలని రఘునందన్ హితవు చెప్పారు.
Comments
Post a Comment