జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ మందికి సహాయం అందించేలా కృషి చేయండి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఎక్కువ మందికి సహాయం అందించేలా కృషి చేయండి -  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


Nalgonda: 

          జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.


          బుధవారం ఆమె నల్గొండ జిల్లా, చిట్యాల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు, పిఓబి భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు.

          మండలంలో అన్ని గ్రామాల వారిగా ఏప్రిల్ 2017 నుండి మరణించిన వారి వివరాలను తెప్పించుకుని అందులో నుండి కుటుంబ పెద్ద మగ లేదా ఆడ ఎవరు చనిపోయిన అలాంటి వారి వివరాలు సేకరించి సంబంధిత కుటుంబ సభ్యుల సహకారంతో మరణ ధ్రువీకరణ పత్రము, ఆధార్, ఇతర ధృపత్రాలను జత చేసి జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను పంపించాలని అన్నారు. ఒకేసారి చనిపోయిన పెద్ద ఇంటి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం వస్తున్నందున ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్కనే ఉన్న నల్గొండ ఆర్ డి ఓ అశోక్ రెడ్డి తో మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లు పరిశీలించి ఆన్ లైన్ ద్వారా పంపించాలని చెప్పారు .

       అనంతరం జిల్లా కలెక్టర్ పిఓపి కేసులు, ఇతర భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు.


       తహసిల్దార్ కృష్ణ, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన