Posts

*నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్*

Image
 *చదువుకి పేదరికం అడ్డుకాదు* *నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్* *పేదరికాన్ని జయించిన చంద్ర కిరణ్* *అభినందనలు తెలిపిన ఉప్పల* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ ఢిల్లీలో శిక్షణ కోసం కావాల్సిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ముషీరాబాద్ లోని వైశ్య బాలుర హాస్టల్ సమావేశ మందిరంలో లంగర్ హౌస్ కు చెందిన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ చంద్ర కిరణ్ కి TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అందజేయడం జరిగింది. ఈ రోజు సివిల్స్ కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ లో వికారాబాద్ జిల్లా లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్ర కిరణ్ కు అభినందనలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ.*

Image
 *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ.* ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్‌ వర్మ.  ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ ను బహూకరించిన తిలక్ వర్మ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు.

*ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్*

Image
 *ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్* హైద్రాబాద్:  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ IVF కార్యాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అడ్వైజారీ బోర్డ్ చైర్మెన్ గంజి రాజమౌళి గుప్త అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోనా శ్రీనివాస్ సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గా ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు. IVF బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. అను నిత్యం ఆర్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజకీయంగా ఆర్థికంగా ఆర్య వైశ్యులు ఎదిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజరీ ముత్యాల సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర IVF ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖ...

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Image
  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు ప్రకృతిని ప్రకృతితో పూజించే పండుగ బతుకమ్మ మరియు ప్రకృతి పరిరక్షణకు ప్రదాన్యత తెలియజేసే పండుగ బతుకమ్మ. తెలంగాణ అస్థిత్వానికి, సంస్కృతికి, వారసత్వానికి, సంప్రదాయానికి, సనాతన ధర్మానికి తెలంగాణ సామూహిక జీవన విదానానికి బతుకమ్మ ప్రతీక.  బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా బతుకమ్మ వేడుకలను పి సి బి సనత్నగర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉద్యోగినిలు నూతన వస్త్రములు దరించి ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో తంగేడు పూలు,గునుగు పూలు,బంతి పూలు చామంతులతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చెర్చి గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మ చుట్టు తిరుగుతూ లయ బద్దంగా రెండు అర చేతులతో చప్పట్లు చెస్టూ.. కాళ్లను కుదుపుతూ శ్రీ రామ రామ వుయ్యాలో, జయ రామ రామ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో మహిళా ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు . దీనితో ఆ ప్రాంతం అంత సందడిగా మారింది అనంతరం బతుకమ్మలను నీటి తొట్టెలో నిమజ్జనం చేసారు. అమ్మకు నివేదించిన పలహారాన్ని పంచుకొని అ...

ఏసీబీ వలలో మరో ఇద్దరు

Image
  ఏసీబీ వలలో మరో ఇద్దరు ACB వలలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఎల్లంపేట మునిసిపాలిటీ, పట్టణ ప్రణాళిక అధికారి 27-09-2025న మల్కాజ్‌గిరి జిల్లా, మేడ్చల్, ఎల్లంపేట మునిసిపాలిటీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ AO  చింతల రాధా కృష్ణ రెడ్డి, తెలంగాణ ACB, సిటీ రేంజ్ యూనిట్-2 చేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 3,50,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించాడు. అంటే "ఇతర భూ యజమానులకు సౌకర్యాలు కల్పించే నెపంతో ఫిర్యాదుదారుడి లేఅవుట్ కాంపౌండ్ వాల్ మరియు గేట్లను కూల్చివేసనందుకు". మొదట AO అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 5,00,000/- డిమాండ్ చేశాడు మరియు ఇప్పటికే రూ. 1,50,000/- తీసుకున్నాడు. ఎల్లంపేట మునిసిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ AO శ్రీ చింతల రాధా కృష్ణ రెడ్డిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ################################# టెక్నికల్ అసిస్టెంట్ (అవుట్‌సోర్సింగ్), పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, O/O ది MPDO, కన్నెపల్లి, మంచిర్యాల జిల్లా ACB వలలో ఉన్నారు. 27...

40 వేలు లంచం డిమాండ్ - ACB వలలో సబ్ ఇన్స్పెక్టర్

Image
 40 వేలు లంచం డిమాండ్ - ACB వలలో సబ్ ఇన్స్పెక్టర్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ SHO సబ్ ఇన్స్పెక్టర్ ACB వలలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పి.ఎస్. మణుగూరు, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ఎస్‌హెచ్‌ఓ (AO) బతిని రంజిత్ పై ACB క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసింది.  మణుగూరు పోలీస్ స్టేషన్‌లో BNS చట్టంలోని సెక్షన్ 318(iv), 296(3) r/w 3(v) కింద నమోదు చేయబడిన Cr. No. 292/2025లో BNSS చట్టంలోని సెక్షన్ 35(3) కింద ఫిర్యాదుదారునికి మరియు అతని సోదరుడికి నోటీసులు జారీ చేసినందుకు బహుమతిగా ఫిర్యాదుదారుని నుండి రూ. 40,000/- లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. అందువల్ల, AO ని అరెస్టు చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నామనీ, కేసు దర్యాప్తులో ఉందనీ, . భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామనీ ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ACB యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని ఏసీ...

11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్

Image
 11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ 5 కె వి నుండి 11 కె.వి మార్చడానికి విద్యుత్ మీటర్ విప్పి మరలా సీజ్ చేయటానికి 30,000/-డిమాండ్ హైద్రాబాద్:  ఫిర్యాదుధారుని ఇంటికి 5 కె.వి. నుండి 11 కె.వి. వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడం కోసం వైరింగ్ మార్చడానికి, ఇంట్లో ఉన్న విద్యుత్తు మీటర్‌ను విప్పి మరలా సీల్ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.11,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ పట్టుబడ్డాడు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు