*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*
*భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై దాడికి ప్రయత్నించిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి.*
*ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్*
నల్గొండ:
భారత న్యాయ వ్యవస్థకు గుండెకాయ లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే దుండగుడు దాడికి ప్రయత్నించడం క్షమించరాని నేరంగా భావించాలని,
అట్టి దుండగునికి కఠినమైన శిక్ష విధించాలని , దేశద్రోహిగా ప్రకటించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..ఇలా దాడికి ప్రయత్నించడం భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను కించపరచడానికి కుట్ర పన్నట్టుగా భావించాల్సి వస్తుందని తెలియజేశారు . ఇట్లాంటి దుశ్చర్య యావత్ భారతదేశ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాలను కించపరిచినట్లుగా భావించాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ దుండగుని పై కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను కోరారు. లేనియెడల పెద్ద ఎత్తు న నిరసన కార్యక్రమాలు చేపడతామని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు....
Comments
Post a Comment