తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు




 


తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి ) లో ఘనంగా బతుకమ్మ సంబురాలు


ప్రకృతిని ప్రకృతితో పూజించే పండుగ బతుకమ్మ మరియు ప్రకృతి పరిరక్షణకు ప్రదాన్యత తెలియజేసే పండుగ బతుకమ్మ.

తెలంగాణ అస్థిత్వానికి, సంస్కృతికి, వారసత్వానికి, సంప్రదాయానికి, సనాతన ధర్మానికి తెలంగాణ సామూహిక జీవన విదానానికి బతుకమ్మ ప్రతీక. 

బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా బతుకమ్మ వేడుకలను పి సి బి సనత్నగర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఘం నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉద్యోగినిలు నూతన వస్త్రములు దరించి ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో తంగేడు పూలు,గునుగు పూలు,బంతి పూలు చామంతులతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒక చోట చెర్చి గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మ చుట్టు తిరుగుతూ లయ బద్దంగా రెండు అర చేతులతో చప్పట్లు చెస్టూ.. కాళ్లను కుదుపుతూ శ్రీ రామ రామ వుయ్యాలో, జయ రామ రామ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆట పాటలతో మహిళా ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు . దీనితో ఆ ప్రాంతం అంత సందడిగా మారింది అనంతరం బతుకమ్మలను నీటి తొట్టెలో నిమజ్జనం చేసారు. అమ్మకు నివేదించిన పలహారాన్ని పంచుకొని అందరు కలిసి సందడిగా వేడుకలు జరుపుకున్నారు..

సాంకేతిక, శాస్త్రీయ, పరిపాలన, ఖాతాలు విభాగం ఉద్యోగులు , మహిళా సిబ్బంధి అధిక సంఖ్య లో పాల్గొని ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.



Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం