11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్
11,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్
5 కె వి నుండి 11 కె.వి మార్చడానికి విద్యుత్ మీటర్ విప్పి మరలా సీజ్ చేయటానికి 30,000/-డిమాండ్
హైద్రాబాద్:
ఫిర్యాదుధారుని ఇంటికి 5 కె.వి. నుండి 11 కె.వి. వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడం కోసం వైరింగ్ మార్చడానికి, ఇంట్లో ఉన్న విద్యుత్తు మీటర్‌ను విప్పి మరలా సీల్ చేయడానికి” అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- డిమాండ్ చేసి అందులో నుండి రూ.11,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్‌కు చెందిన జూనియర్ లైన్‌మెన్ శ్రీకాంత్ గౌడ్ పట్టుబడ్డాడు.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు
Comments
Post a Comment