*ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్*


 *ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కోనా శ్రీనివాస్*


హైద్రాబాద్: 


ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా వెస్ట్ గోదావరి జిల్లా కి చెందిన కోనా శ్రీనివాస్ ని కుబేర టవర్స్ నారాయణ గూడ IVF కార్యాలయం లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ అడ్వైజారీ బోర్డ్ చైర్మెన్ గంజి రాజమౌళి గుప్త అలాగే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు.


ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోనా శ్రీనివాస్ సేవలు గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గా ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు. IVF బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. అను నిత్యం ఆర్య వైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజకీయంగా ఆర్థికంగా ఆర్య వైశ్యులు ఎదిగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో చీఫ్ అడ్వైజరీ ముత్యాల సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర IVF ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, IVF youth President కట్ట రవి గుప్త ,కోనా భువన్, వంశీ, కోనా రమేశ్, అంజి బాబు, మరియు ఇతర IVF నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం