Posts

ABVP ఆధ్వర్యంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి వినతి

Image
 ABVP ఆధ్వర్యంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి వినతి  నల్గొండ:  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నల్గొండలో రాష్ట్ర రోడ్లు,భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి యూనివర్సిటీ సమస్యల పై మరియు నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వినతిపత్రం అందజేసారు.  సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చెయ్యని కారణంగా ఫీజుల భారం విద్యార్థుల పై పడుతుందని. వాటిని రెగ్యులర్ చేసి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతూ,నూతన కోర్సులు (లా,ఫార్మసీ, బిఈడి,ఎంఈడి, జర్నలిజం) ప్రవేశపెట్టాలని ఆ వినతి పత్రం లో కోరారు. నిత్యం వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీకి రాకపోకలు జరిపే సందర్భంలో నేషనల్ హైవే ఉన్న కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారని స్కై వాక్ ఏర్పాటు చెయ్యాలని, ప్లేస్మెంట్ లో భాగంగా యూనివర్సిటీ కి మల్టీ నేషనల్ కంపెనీస్ తీసుకొచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎబివిపి ప్రతిందులు తెలిపారు. ఈ కార్యక్రమంలో య...

ఏసీబీ నెట్‌లో సబ్-ఇన్స్పెక్టర్ & డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ (AR) ములుగు:

Image
  ఏసీబీ నెట్‌లో సబ్-ఇన్స్పెక్టర్ &  డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ (AR) ములుగు:  11-11-2025న, దాదాపు 1900 గంటల ప్రాంతంలో, సిద్ధిపేట కమిషనరేట్‌లోని ములుగు పోలీస్ స్టేషన్‌కు చెందిన నిందితుడు అధికారి-1 (AO-1), సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ Ch. విజయ్ కుమార్ మరియు అతని డ్రైవర్ నిందితుడు అధికారి-2 (AO-2), పోలీస్ కానిస్టేబుల్ (AR) రాజులను ఆ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. AO-1 అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా AO-2 ద్వారా ఫిర్యాదుదారుడి నుండి ₹50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించాడు. అంటే "ఫిర్యాదిదారుడి అక్కకు సంబంధించిన నివాస ఆస్తిని తొలగించి ఆమెకు స్వాధీనం చేసి ఫిర్యాదుదారునికి సహాయం చేసినందుకు సంబంధించి Cr. No. 95/2025 u/s 420, 423, 447, 427 IPC, సెక్షన్. 156(3) Cr.PC". AO-2 వద్ద నుండి ₹50,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO-1 మరియు AO-2 లను అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని గౌరవనీయులైన II అదనపు ప్రత్యేక న్యాయమూర్తి, SPE & ACB కేసుల విచారణ కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందనీ. భద్రతా కారణాల దృ...

సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం - ఆర్ టీ ఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి - ఆర్య వైశ్య జర్నలిస్టులకు ఘనంగా సత్కారం

Image
సమాజ నిర్మాణంలో  జర్నలిస్టుల పాత్ర కీలకం -  ఆర్ టీ ఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆర్య వైశ్య జర్నలిస్టులకు ఘనంగా సత్కారం  సికింద్రాబాద్: పాత్రికేయ వృత్తి  ఎంతో ఉత్కృష్టమైన దని,  సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని  సమాచారహక్కు (ఆర్ టీ ఐ) కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో    శనివారం. 'కలం యోధులకు అభినందన మందారమాల'  పేరిట నిర్వహించిన  ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ అయినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో  ఈ వృత్తికి అంకితమై పనిచేస్తున్న జర్నలిస్టులను ఆయన కొనియాడారు. వారి శ్రమను గుర్తిస్తూ.. బాధ్యతను పెంచే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య జర్నలిస్టులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆర్య వైశ్య  జర్నలిస్టులు దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు వారసులుగా  సమాజ...

కాన్సర్..చేత ఔట్ అవ్వకు మిత్రమా..

Image
 కాన్సర్..చేత ఔట్ అవ్వకు మిత్రమా.. చెదలు పట్టకుండా..ఇంటి తలుపు లకు టేకు కర్ర వాడతాం..ఇంటికి ఎవరైనా బంధువులు వస్తె..ఇది ఆ బ్రాండు.అది ఈ బ్రాండు అంటూ..మన స్టేటస్ గురించి పరోక్షంగా గొప్పగా చెప్పుకుంటాం. ఇన్ని రకాలుగా మన జీవన విధానం లో అద్భుత నాణ్యత కోసం తపన పడి వాళ్ళం.. ఎందుకో ఏమో.. హృదయాన్నీ, వూపిరి తిత్తుల దగా చేసే ధూమపానం అలవాటు ను మాత్రం ..ఇపుడు కాక పోయినా ఎప్పుడో ఇల్లు ,ఒళ్ళు గుళ్ళచేస్తుంది అని తెలిసి కూడా.. దమ్ము ఆగి"పోయే" దాకా..దమ్ము కొడుతూనే ఉంటాం. దేహం ఎంత ధృఢం గా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్ర కు గేట్ తీసినట్టే. పొగాకు తో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి,తెలుసుకోవటానికి వైద్యం చదవ నవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది.ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్ర లో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు.కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు,ధూమపానం అలవాటు కు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది.అలాగే తెలుగు సినిమా కు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని,సమ"కూర్చిన" రచయితలు , కవులు,కొం...

ఏసీబీ కి చిక్కిన జిల్లా పౌర సరఫరాల కార్యాలయం మేనేజర్ & టెక్నికల్ అసిస్టెంట్

Image
ఏసీబీ కి చిక్కిన జిల్లా పౌర సరఫరాల కార్యాలయం మేనేజర్ & టెక్నికల్ అసిస్టెంట్  6-11-2025న, ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయం జిల్లా మేనేజర్ శ గురుబెల్లి వెంకట్ నర్సింహారావు, కాగజానగర్ ఎక్స్ రోడ్ సమీపంలో, ఫిర్యాదుదారుడి నుండి అధికారిక సహాయం కోసం, అంటే తన రైస్ మిల్లు నుండి పిడిఎస్ బియ్యం లోడ్ చేసిన మూడు లారీలను బియ్యం నాణ్యత తనిఖీ చేయకుండా ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోడౌన్‌కు రవాణా చేయడానికి అనుమతించినందుకు, ఆదిలాబాద్ యూనిట్ ఎసిబి అధికారులు లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  అంతకుముందు, ఎఒ-1 సూచనల మేరకు, ఎఒ-2 టెక్నికల్ అసిస్టెంట్ (అవుట్‌సోర్సింగ్)  కొత్తగొల్ల మణికాంత్ కూడా ఫిర్యాదుదారుడి నుండి లంచం మొత్తాన్ని డిమాండ్ చేశారు. AO-1 వద్ద నుండి లంచం మొత్తం రూ.75,000/- స్వాధీనం చేసుకున్నారు.  AO-1 నుండి AO-2 వరకు అరెస్టు చేయబడి, కరీంనగర్‌లోని SPE & ACB కేసుల గౌరవనీయ I అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచబడుతున్నారు. కేసు దర్యాప్తులో ఉందనీ,  భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచామని అధికారుల...

HYD: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ACB దాడులు

Image
 HYD: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ACB దాడులు హైద్రాబాద్ లోని పలుచోట్ల ఏసీబీ మెరుపు దాడిచేసింది. కూకట్పల్లి మూసాపేట్, కుత్బుల్లాపూర్ సూరారం, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు గేట్లు క్లోజ్ చేసి ఫైళ్లు చెక్ చేస్తున్నారు. ఉదయం నుంచి కార్యాలయాలను అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి. ఎవరూ రాకుండా అధికారులు గేట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పెద్ద మనసున్న చిన్న ఎల్లారెడ్డి! రజాకార్లను తరిమికొట్టాడు ఊరందరికీ తోడున్నాడు

Image
 పెద్ద మనసున్న చిన్న ఎల్లారెడ్డి! రజాకార్లను తరిమికొట్టాడు  ఊరందరికీ తోడున్నాడు .. మహబూబ్ నగర్: ఆయన పేరుకే చిన్న ఎల్లారెడ్డి! కానీ పెద్ద మనసు కలవాడు!! సాధారణ కుటుంబంలో జన్మించి అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. రజాకార్లను తరిమికొట్టాడు. పేదలకు అండగా నిలిచాడు.వందలాది మందికి ఉపాధి కల్పించాడు. తన సంతానం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడు. దేవరకద్ర నియోజకవర్గం లోని ధమాగ్నాపూర్ గ్రామంలో తోకల చిన ఎల్లారెడ్డి 1926 అక్టోబర్ 10వ తేదీన జన్మించాడు. నాటి పరిస్థితులు ఘోరంగా ఉండేవి. గ్రామాలపై రజాకార్లు పాశవిక దాడుల నిర్వహించేవారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో గ్రామస్తులను కూడగట్టాడు. రజాకార్లను తరిమికొట్టాడు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో తన వంతుగా బీడీ పరిశ్రమ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పించాడు. నాటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు, తన పరిచయస్తుల ద్వారా వందలాది మందికి ముంబైలో ఉపాధి కల్పించాడు. మూడు దఫాలు దమగ్నాపూర్ కు ఎదురులేని నేతగా, ప్రజల మనసు గెలుచుకున్న సర్పంచిగా ఎన్నికయ్యాడు.ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ జీవితంలో కష్టపడితేనే, ఎదుగుతామని ముక్క...