HYD: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ACB దాడులు
HYD: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ACB దాడులు
హైద్రాబాద్ లోని పలుచోట్ల ఏసీబీ మెరుపు దాడిచేసింది. కూకట్పల్లి మూసాపేట్, కుత్బుల్లాపూర్ సూరారం, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి ఏసీబీ అధికారులు గేట్లు క్లోజ్ చేసి ఫైళ్లు చెక్ చేస్తున్నారు. ఉదయం నుంచి కార్యాలయాలను అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరుగుతున్నాయి.
ఎవరూ రాకుండా అధికారులు గేట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments
Post a Comment