ABVP ఆధ్వర్యంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి వినతి


 ABVP ఆధ్వర్యంలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి వినతి 

నల్గొండ: 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక నల్గొండలో రాష్ట్ర రోడ్లు,భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి యూనివర్సిటీ సమస్యల పై మరియు నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వినతిపత్రం అందజేసారు.

 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చెయ్యని కారణంగా ఫీజుల భారం విద్యార్థుల పై పడుతుందని. వాటిని రెగ్యులర్ చేసి పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతూ,నూతన కోర్సులు (లా,ఫార్మసీ, బిఈడి,ఎంఈడి, జర్నలిజం) ప్రవేశపెట్టాలని ఆ వినతి పత్రం లో కోరారు.

నిత్యం వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీకి రాకపోకలు జరిపే సందర్భంలో నేషనల్ హైవే ఉన్న కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారని స్కై వాక్ ఏర్పాటు చెయ్యాలని, ప్లేస్మెంట్ లో భాగంగా యూనివర్సిటీ కి మల్టీ నేషనల్ కంపెనీస్ తీసుకొచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.

మంత్రి సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎబివిపి ప్రతిందులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్,కార్యదర్శి మోహన్,యూనివర్సిటీస్ కో-కన్వీనర్ మౌనేష్,ఉపాధ్యక్షులు విజయ్,సూర్య విద్యార్థి నాయకులు సంపత్,నరసింహ,సుధీర్,సతీష్,అజయ్,దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం