సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం - ఆర్ టీ ఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి - ఆర్య వైశ్య జర్నలిస్టులకు ఘనంగా సత్కారం
సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకం - ఆర్ టీ ఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి
ఆర్య వైశ్య జర్నలిస్టులకు ఘనంగా సత్కారం
సికింద్రాబాద్: పాత్రికేయ వృత్తి ఎంతో ఉత్కృష్టమైన దని, సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని సమాచారహక్కు (ఆర్ టీ ఐ) కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో శనివారం. 'కలం యోధులకు అభినందన మందారమాల' పేరిట నిర్వహించిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ అయినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో ఈ వృత్తికి అంకితమై పనిచేస్తున్న జర్నలిస్టులను ఆయన కొనియాడారు. వారి శ్రమను గుర్తిస్తూ.. బాధ్యతను పెంచే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య జర్నలిస్టులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆర్య వైశ్య జర్నలిస్టులు దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు వారసులుగా సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు . కేవలం వైశ్యులకే కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు తాము సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్యానికి సైతం విరాళాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు వివరించారు. సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వారి సేవలను గుర్తిస్తూ కలం యోధులకు అభినందన మందారమాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా ఆర్యవైశ్య జర్నలిస్టులు తరలి రావడం పట్ల హర్షం ప్రకటించారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు దోసపాటి వెంకటేశ్వరరావు, సిద్ద సూర్య ప్రకాష్ రావు ,బోడ సూర్య ప్రకాష్, గార్లపాటి శ్రీనివాసులు, సుజాత రమేష్ బాబు లు ప్రసంగించారు. , సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య, డబ్ల్యు జేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఆర్టిఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణ చేతుల మీదుగా జర్నలిస్టులందరికీ వాసవి మీడియారత్న పురస్కారాలను ప్రదానం చేశారు.

Comments
Post a Comment