ఘనంగా బండారు సుబ్బారావు జన్మదినోత్సవం


 ఘనంగా బండారు సుబ్బారావు జన్మదినోత్సవం



చౌటుప్పల్, గూఢచారి: *అభినవ దానకర్ణుడు, సీల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు జన్మదినోత్సవం సందర్భంగా, ఆయన విలువైన పాలసీదారుడు కౌటికె విఠల్ ప్రత్యేకంగా 600 మంది నిర్భాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, వారి దీవెనలను సుబ్బారావు కి అంకితం చేస్తూ జన్మదినాన్ని అర్ధవంతంగా జరుపుకున్నారు.*




*ఈ సేవా కార్యక్రమం చౌటుప్పల్ సమీపంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న అమ్మానాన్న అనాధ ఆశ్రమంలో నిర్వహించబడింది.*

*కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ హాజరై, రిబ్బన్ కటింగ్ చేసి అన్నప్రసాదం ప్రారంభించారు.*

*స్థానిక జీవిత బీమా ఏజెంట్లు, ముఖ్యంగా లియాఫీ అధ్యక్షులు సైదులు గారు తన తోటి నాయకులతో కలిసి హాజరై, ఆలిండియా నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అయిన శ కౌటికె విఠల్ గారిని బొకేతో సత్కరించారు.*

*పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం మరియు అనాధాశ్రమ చైర్మన్ గట్టు శంకర్ కార్యక్రమానికి విచ్చేసి, దేవాలయం – ఆశ్రమాన్ని శ్రద్ధగా దర్శింపజేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బండారు సుబ్బారావు కి అందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించాలని ఆశీర్వదించారు.*

*దాదాపు 600 మంది నిర్భాగ్యులు తృప్తిగా భోజనం చేసిన ఈ సేవా కార్యక్రమం ఎంతో ప్రశంసలు పొందింది. ఆశ్రమ సిబ్బంది చూపిన సేవాభావం, క్రమశిక్షణ ప్రత్యేకంగా నిలిచింది. వారికి నాయకత్వం వహిస్తున్న గట్టు శంకర్ గారి సేవా తత్పరత అందరూ మెచ్చుకున్నారు.*





*ఈ సందర్భంగా ముఖ్య అతిథి సత్యనారాయణ మాట్లాడుతూ నా 40 ఏళ్ల సేవా చరిత్రలో పాలసీదారుడి జన్మదినాన్ని ఇలాగే అనాధలకు అన్నదానంగా జరుపుకోవడం ఎక్కడా చూడలేదు. ఇది ఇన్సూరెన్స్ రంగంలోనే తొలి ఘట్టం” అని అభినందించారు.*

 “విఠల్ వద్ద ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి పాలసీదారు సంతోషంగా, ఆరోగ్యంగా 100 సంవత్సరాలు జీవించాలి అనే తపన ఆయనలో ఉంది. ఇది నిజంగా ప్రశంసనీయం” అని తెలిపారు.*

కౌటికె విఠల్ సతీమణి శ్రీమతి కౌటికె కావ్య  కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.




*ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ నా పాలసీదారులందరూ యోగక్షేమాలతో, రోగరహితంగా, ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని ప్రతిరోజూ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. అధిక ప్రీమియం కలిగిన పాలసీదారుల జన్మదినోత్సవాలను సేవా కార్యక్రమాల రూపంలో జరపడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో కూడా వారు అభివృద్ధి చెందుతూ మరిన్ని పాలసీలు చేస్తూ మా సేవలకు తోడ్పడాలి” అని అభిషలించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం