కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి
కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి *అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి* సంగారెడ్డి: ఆంగ్ల నూతన సంవత్సరాది ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి గురువారం నాడు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరింత స్పూర్తివంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరిస్తున్నామని అందువల్ల జిల్లా యంత్రాంగం కూడా జర్నలిస్టుల పట్ల అదేవిధంగా సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల కొత్త అక్రిడిటేషన్ పాలసీ వచ్చిందని దానిలో కూడా అనేక మార్పులు చేయాల్సిందిగా తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్. ఆధ్వర్య...