పనిప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం: అడిషనల్ కలెక్టర్ కే.సీతారామారావు


 ​పనిప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం: అడిషనల్ కలెక్టర్ కే.సీతారామారావు

గూఢచారి, సూర్యాపేట, డిసెంబర్ 30: స్త్రీలను  పనిచేసే ప్రదేశాల్లో గౌరవించడం మన సంప్రదాయం అని అదనపు కలెక్టర్ కె సీతారామారావు అన్నారు. మంగళవారం సూర్యాపేట సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  జరిగిన పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధము మరియు పరిష్కార చట్టంపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం  (POSH Act - 2013) సందర్భంగా అదనపు  కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూపనిచేసే చోట మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం మరియు వారి గౌరవానికి భంగం కలగకుండా చూడటం ప్రతి సంస్థ బాధ్యత అని అన్నారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు తమ హక్కుల పట్ల, చట్టాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.

​అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC): 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు ఏదైనా వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

​చట్టపరమైన రక్షణ: 2013 చట్టం ప్రకారం వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, మహిళలకు పని ప్రదేశాల్లో ఆత్మగౌరవంతో కూడిన వాతావరణాన్ని అందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు.తదుపరి Posh Act -2013 చట్టం కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఈవో శిరీష మాట్లాడుతూ మహిళ ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలని  మహిళలను తక్కువగా, చులకనగా చూడటం, సైగలు చేయటం, అసభ్యకరంగా తాకటం, సెల్ ఫోన్లో అసభ్య మేసెజ్ లు పంపిస్తే  ఇబ్బంది పడకుండా మానసికంగా లో లోపల కుమిలిపోకుండా ధైర్యంగా కమిటీ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, అట్టి ఫిర్యాదులను స్వీకరించి రహస్యంగా దర్యాప్తు జరిపించి బాధితులకు న్యాయం చేయటం జరుగుతుందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, కమిటీ సభ్యులు దయానంద రాణి, శంకర్ నాయక్, జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, టీఎన్జీవోస్ జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్, కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం