అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం

 


 అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని  ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం

గూఢచారి, హైదరాబాద్ జనవరి 1:

    ప్రస్తతం జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ , సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి <A . రేవంత్ రెడ్డి గారిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి కల్సిన సందర్భలో ,ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి TGEJAC నాయకత్వం తీసుకురాగా అయన సానుకూలంగా స్పందించారు.


      ఈ సంధర్భంగా తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి. శ్యామ్ ను ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు పరిచయం చేయగా ఆయనను అభినందించడం జరిగింది . అలాగే పదవి విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి A . సత్యనారాయణను ముఖ్యమంత్రి శాలువ తో సత్కరించి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది .


ఈ కార్యక్రమములో పాల్గొన్నవారు ముజీబ్ హుస్సేన్, ఎ. సత్యనారాయణ,, మధుసూదన్ రెడ్డి, బి. శ్యామ్, అనిల్ కుమార్, కస్తూరి వెంకటేశ్వర్లు, తిరుపతి యాదవ్, సత్యనారాయణ గౌడ్, సహదేవ్, నరహరి రావు, శ్రీరామ్ రెడ్డి, శిరీష, సురేష్ నాయక్, ఎం.బి. కృష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, నరసింహా రెడ్డి, షౌకత్ హుస్సేన్, లక్ష్మణ్ గౌడ్ తడితరులు.


 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన