నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి*
*నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం* - *మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి* *మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు* ************************************************** *నల్లగొండ*: **ఫిబ్రవరి 11న జరిగే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు* *శుక్రవారం తన సతీమణి నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిచే 32వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు* *ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు* *నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో కేంద్ర,రాష్ట్రాల నుంచి అత్యధిక నిధులు వస్తాయన్నారు* *దీంతో నల్లగొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు* *ఇప్పటికే పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు* *కార్పొరేషన్ లోని అన్ని డివిజన...