క్విట్ టుబాకో బీ ఏ హీరో

 


క్విట్ టుబాకో బీ ఏ హీరో

ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం)

"ఏవండి సాయంత్రం సినిమా కి వెళ్దాం ఇంటికి త్వరగా రండి"

సర్లే..అంటూ..సిగరెట్ దమ్ము లాగుతూ ..బండి పై కూర్చుని ఆఫీసుకు వెళ్ళి పోయాడు శైలజ భర్త.


"ఈ..నగరానికి ఏ..మైంది..

అంటూ .. మొదలై 

గుట్కా బీడీ,సిగరెట్ ఇవి ప్రాణాంతకం అని హెచ్చరించి ముగిసింది 

ప్రజా హితం కోసం జారీ చేసిన ప్రకటన.


ఏ హిట్ సినిమా అయినా..

ఖచ్చితంగా 

Smoking is injurious to health 

అనే ప్రకటన తో ప్రారంభం కావాల్సిందే.


ఇది ఎందుకు చెప్తున్నా..నంటే

ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న నన్ను .

సిగరెట్ మానమని మాకు హిత బోధ చేసే బదులు 

ఫ్యాక్టరీ ల ను బంద్ చేయొచ్చు కదా "మాచన"గారు

అని అన్న వారెందరో..

ఐతే..

జన బాహుల్యానికి తెలవని ముచ్చట ఎంది అంటే

పారిశ్రామిక విధానం ప్రకారం

ప్రభుత్వాల కు , పరిశ్రమ లను మూసే హాక్కు లేదు.

కావున

పొగాకు వల్ల,పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ రావడం ఖాయం 

కాబట్టి

చికిత్స కంటే నివారణ శ్రేష్టం అని అంటారు కదా..

సో..

దమ్ము కొట్టడం మానేస్తే?!

మన హృదయం

మన కాలేయం 

ఆరోగ్యం కు మనమే హాని తలపెట్టిన పాపం మనకు అంటదు.


సినిమా మొదలయ్యాక అడపా దడపా దగ్గుతూనే ఉన్నారు హరి.

బోర్ గా అనిపిస్తే..

పాట వస్తే మళ్ళీ బయటకి వెళ్లి దమ్ము కొట్టి వస్తున్నాడు.

ఇదంతా గమనించిన హిమ బిందు

హరి సినమా వద్దు లే.. ఇంటికి వెళ్దాం పదా అంది.


ఐ..యామ్ సారి,రా.. బిందు 

అంటూ

ఏదో చెప్పబోయాడు హరి 


ఇపుడు అంటే ఇంటర్వల్ లో నే వచ్చేశాం

మరి జీవితం కూడా ఇంటర్వల్ వరకే నా అన్నది.

కంట్లో నీళ్ళు తుడుచుకుంటూ

వ్యసన పరుడైన శ్రీవారిని ఏమి అనలేక.



*దమ్ము కొడితే కాన్సర్ ఎలా వస్తుంది*


పొగాకు,పగాకు. ఆరోగ్యం పై పగ బడుతుంది.

దేహం ఎంత ధృఢం గా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్ర కు గేట్ తీసినట్టే.

పొగాకు తో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి,తెలుసుకోవటానికి వైద్యం చదవ నవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది.ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్ర లో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు.కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు,ధూమపానం అలవాటు కు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది.అలాగే తెలుగు సినిమా కు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని,సమ"కూర్చిన" రచయితలు , కవులు,కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్ల నే చిత్ర పరిశ్రమ కు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. 

ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాలి చేసి పర్సు ఖాలి చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.

సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.

దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడి లో నీ పొగాకు తో పెనవేసుకున్న రసాయనాలు శరీరం లోకి ప్రవేశించి కణాల డి ఎన్ ఏ ను నాశనం చేసే పని లో పడతాయి.అంటే సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా..సిగరెట్ అలవాటు కు ముందు ,ఆ తర్వాత అని చెప్పొచ్చు. దొస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు.

అమ్మా, నాన్న లు ఇచ్చే పాకెట్ మనీ తో గుట్టుగా సిగరెట్ కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండి గా పైసలు ఉన్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటు కు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమా ల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువత ను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాల ల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు.

అయినా..ఎవరో వచ్చి చెప్తే నే ..

"బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది. 


సిగరెట్ ,బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కందరాల్ని ఐనా తుప్పు పట్టించే పని లో ఉంటాయి.పటిష్ట మైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్)అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్ కు దారి తీస్తాయి.ఆరోగ్యం గా ఉన్న కణాల డి ఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాల పై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యం కు కూడా కణాల ఆరోగ్యం అవశ్యం. 

సిగరెట్,బీడీ అలవాటు వల్ల కణాల డి ఎన్ ఏ ను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెళ్లిగా రోగ నిరోధక శక్తి నీ దారుణంగా దెబ్బ తీస్తాయి.దీంతో దేహానికి పోరాడదాం అని ఆశ పడే సత్తా ను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాల పై రాక్షసంగా దండ యాత్ర చేసి. దేహాన్ని జబ్బు ల తో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపి లో దిగబడ్డ ప్రాణి లా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.

మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకు తో దోస్తీ దేనికి.

దూరంగా ఉంటే ఆరోగ్యం తో పాటు ఐశ్వర్య కూడా మన దగ్గరే ఉంటుంది.


మాచన రఘునందన్ 

9441252121

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత 


పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్