జైపాల్ రెడ్డి భౌతికకాయానికి  ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి


జైపాల్ రెడ్డి భౌతికకాయానికి 
ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి


మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి..ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు.


సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు కే కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్ , పల్లారాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది.



Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు