ఆర్యవైశ్యుల శక్తి అపారం - మంత్రి వాకిటి శ్రీహరి
* జయాపజయాలను ప్రభావితం చేయగలరు
* వాసవీ పారాయణం ప్రపంచ రికార్డు సృష్టించాలి
హైదరాబాద్: ఆర్యవైశ్యుల శక్తి అపారం..వారు తలచుకుంటే రాజకీయాలను , జయాపజయాలను ప్రభావితం చేయగలరని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వారు రాజకీయాల్లో ఎదగాలన్నారు.ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయిలో ఆర్యవైశ్యులు వాసవి మాత పారాయణం చేయ తలపెట్టడం హర్షణీయమని అన్నారు. ఎల్బీ స్టేడియం దద్దరిల్లేలా నలభై వేల మందితో... భవిష్యత్తులో ఎవరూ చేయలేని విధంగా వాసవీమాత పారాయణం చేయాలన్నారు. ఆ రికార్డు కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని తెలిపారు
శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం పేరిట ఈనెల 22న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సామూహిక పారాయణానికి సంబంధించి గురువారం బంజారా హిల్స్ పార్క్ హోటల్ కర్టెన్ రెయిజర్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కల్వ సుజాత సంకల్పాన్ని కొనియాడారు. . శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం కావాలని ఐ అండ్ పీ ఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆకాంక్షించారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కాల్వ సుజాత మాట్లాడుతూ
21,000 మందితో సామూహిక పారాయణానికి వైశ్యులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అందుకు తగిన ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ పారాయణం ప్రపంచ రికార్డు కాబోతోందని అన్నారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించిన 102 చరణాల వాసవీ మాత స్తుతి గీతాన్ని ఈ కార్యక్రమంలో ఆలపించారు. వాసవమ్మ జాతరకు తరలి రావాలంటూ ప్రముఖ జర్నలిస్ట్ , మఖన్లాల్ చతుర్వేది జర్నలిజం యూనివర్సిటీ బోర్డు మెంబర్ రావి కంటి శ్రీనివాస్ రచించి, దృశ్య రూపంలో చిత్రీకరించిన గీతాన్ని ఈ సందర్భంగా
ప్రదర్శించారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కొణిజేటి సుబ్బారావు , ఉప్పల శ్రీనివాస్ గుప్తా, చీకోటి ప్రవీణ్ , కాచం సత్యనారాయణ, మలిపెద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు. .








Comments
Post a Comment