కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి


బెంగళూరు: 


కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌


బెంగళూరు: 


కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో కర్ణాటక విధానసభకు నూతన సభపతిగా విశ్వేశ్వర ఎన్నికైనట్లు స్పీకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 


విశ్వేశ్వర వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పార్టీకి నమ్మకమైన నేతగా ఎదిగారు. 


రాజ్యాంగం, శాసనసభా వ్యవహారాలపై పరిజ్ఞానం, భాషపై పట్టు, అందరితో కలిసే తత్వం ఆయన సొంతం. గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 


ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆయనవైపు మొగ్గు చూపారు. 


పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వర అభిప్రాయపడ్డారు. 


సిర్సి నియోజవకర్గానికి చెందిన కగెరి మంగళవారం యెడియూరప్ప, పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. 


తొలి మంత్రివర్గంలో దాదాపు 10 నుంచి 12 మందిని చేర్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


 


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్