Skip to main content

టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్‌ జాబ్‌కు  click  చేసి  అప్లై  చేసుకోండి. TSలో  970, AP లో 2707 పోస్టులు

టెన్త్ పాసైతే పోస్ట్ ఆఫీస్‌ జాబ్‌కు  click  చేసి  అప్లై  చేసుకోండి. TSలో  970, AP లో 2707 పోస్టులు


టెన్త్  పాసయిన వారికి గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్  జారి చెందింది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 5,476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేస్తోంది. ఇండియా పోస్ట్. ఇండియా పోస్ట్ చేపడుతున్న అతిపెద్ద నియామక ప్రక్రియ ఇది. ఇంతకుముందే దేశంలోని ఇతర సర్కిళ్లలో 10,000 పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసిన ఇండియా పోస్ట్... ఇప్పుడు మరో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15న, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది.
నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా లేదా వెబ్‌సైట్‌లో 2019 అక్టోబర్ 15 నుంచి 2019 నవంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


*1. పేరు (10వ తరగతి మార్క్స్ మెమోలో ఉన్న పేరు)
*2. తండ్రి పేరు
*3. మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగించాలి.)
*4. పుట్టిన తేదీ
*5. జెండర్
*6. సామాజిక వర్గం
*7. వికలాంగులైతే ఎంత శాతం వైకల్యం ఉందో వెల్లడించాలి.
*8. 10వ తరగతి పాసైన రాష్ట్రం
*9. 10వ తరగతి పాసైన బోర్డ్
*10. 10వ తరగతి పాసైన సంవత్సరం
*11. 10వ తరగతి సర్టిఫికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్


*ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రిజిస్ట్రేషన్‌ కోసం ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ను మరో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించకూడదు. దీని వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే 'Forgot registration' క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు పేమెంట్ ప్రక్రియ ఉంటుంది.


*గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఫీజు చెల్లించాలి. పోస్ట్ ఆఫీస్‌ల వివరాలు http://appost.in/gdsonline వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో కూడా ఫీజు చెల్లించొచ్చు. హోమ్ పేజీలో ఉన్న పేమెంట్ లింక్ క్లిక్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజు చెల్లించే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


*గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 22 నుంచి 2019 నవంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఫీజు పేమెంట్ పూర్తైన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. వెబ్‌సైట్‌లో Apply Online లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లై చేసిన సర్కిల్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సూచించిన ఫార్మాట్, సైజ్‌లోనే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే.


*1. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో.
*2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. (ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ ఉంటే అవసరం లేదు.)
*3. ఎస్ఎస్‌సీ రెండో ప్రయత్నంలో పాసైతే రెండో సర్టిఫికెట్.
*4. అదనంగా ఉన్న ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో.
*5. కంప్యూటర్ సర్టిఫికెట్.
*6. కమ్యూనిటీ సర్టిఫికెట్.
*7. ఫోటో.
*8. సంతకం.
*9. వికలాంగుల సర్టిఫికెట్.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్