*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్*


*బలహీనుడి పక్షాన నిలిచినప్పుడే అమరులకు నిజమైన నివాళి : ఎస్పీ రంగనాధ్*


నల్గొండ : బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం చేసినప్పుడే అమరులకు నిజమైన నివాళి అని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.


పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా 12వ బెటాలియన్ పోలీసులు, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద ఎస్పీ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా పోలీస్ అమరుల వారోత్సవాలు నిర్వహించు కుంటున్నామని గుర్తు చేశారు. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ పేదలు, బలహీనుడి పక్షాన నిలిచి వారికి న్యాయం అందించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. అమరుల త్యాగాల సాక్షిగా పేద ప్రజలకు అండగా ఉంటామని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం న్యాయం పక్షాన నిలబడతామని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. హీరోలు చనిపోవచ్చు కానీ హీరోయిజం చనిపోదని అదే విధంగా అమరుల త్యాగాలు ఎన్నటికీ నిలిచే ఉంటాయని, వారి త్యాగం శాశ్వతని ఎస్పీ అన్నారు.


జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ క్లాక్ టవర్ నుండి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు నిర్వహించారు.


కార్యక్రమంలో అదనపు ఎస్పీ పద్మనాభ రెడ్డి, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్లు అంజయ్య, పార్థసారధి రెడ్డి, డిఎస్పీలు గంగారాం, రమణారెడ్డి,  ఆర్.ఐ.లు వెంకన్న, వెంకట రమణ, వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, శంకర్, డిపిఓ ఏ.ఓ. నాగరాజన్, ఆర్.ఎస్.ఐ.లు లియాఖత్, హసన్ అలీ, 12వ బెటాలియన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్