ఉత్తర తెలంగాణకు మహాసభ అధ్యక్ష పదవి రావాల్సిందే - కోలేటి రమేశ్ డిమాండ్
ఉత్తర తెలంగాణకు మహాసభ అధ్యక్ష పదవి రావాల్సిందే -
కోలేటి రమేశ్ డిమాండ్
పెద్దపల్లి:
ప్రస్తుతం జరుగనున్న తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో మహాసభ బైలాస్ ప్రకారం ఈసారి ఉత్తర తెలంగాణకు అధ్యక్ష పదవి రావల్సిందేనని పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు కోలేటి రమేశ్ డిమాండ్ చేశారు.
మనకు దక్కాల్సిన పదవిని సైతం వారు దక్కకుండా చేస్తు తిరిగి దొడ్డదారిలో అధికారం సంపాదించుకొవాలని చూస్తున్న విషయం... దానిపై పలువురు నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించిన సంగతి తెలిసిందనని ఆయన తెలిపారు.
ఈ పరిస్థితుల్లో మన హక్కులను కాపాడుకోవడానికి, మన హక్కులను సంపాదించుకోవడానికి గాను “ ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు చెందిన వారికి మాత్రమే ఈసారి మహాసభ అధ్యక్షపదవి ” దక్కాలని, ఇందుకు గాను అందరం కలిసి, సమిష్టిగా పెద్దపల్లి నుండి ఉత్తర తెలంగాణ నినాదం ఎత్తుకోవడం జరుగుతుందనీ, మీ అందరితో మనస్సువిప్పి మాట్లాడుకోవడానికి గాను అత్యవసర సమావేశాన్ని వైశ్యభవన్, పెద్దపల్లి లో 27-07-2025, ఆదివారం ఉదయం 10-30 లకు ఏర్పాటు చేయడం జరిగిందనీ. పెద్దపల్లి జిల్లాలోని మండల ఆర్యవైశ్య సంఘాల అద్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొశాధికారులు, జిల్ల మాజీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొశాధికారులు, పట్టణ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, సీనీయర్ నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావల్సిందిగా సాదరణంగా ఆయన ఆహ్వానించారు. అందరి ఆలోచన మేరకు, మన కార్యచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడం జరుగుతుందని.. ఈ పోరాటంలో మీరు, మేము, మనమందరం కలిసి సమిష్టిగా అడుగులు వేయాలని ఆశీస్తున్నాననీ తెలిపారు
.
Comments
Post a Comment