టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు
టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు
హైద్రాబాద్:
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) సనత్నగర్ లో దేవి నవరాత్రి వేడుకలు మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారములో అమ్మ వారికి ప్రత్యేక పూజలు.
దేవి శరన్నవరాత్రి వుత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) 9 రోజుల దేవి నవరాత్రి పండుగను , భక్తిశ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నారు. సభ్య కార్యదర్శి, అధికారులు మరియు సిబ్బంది కలిసి, ప్రత్యేకముగా అలంకరించిన మండపంలో బాల త్రిపుర సుందరికి సాంప్రదాయ కుంకుమ పూజను నిర్వహించారు. పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని, ప్రాంగణంలో ఆధ్యాత్మికంగా ఉత్సాహభరితమైన శోభ నింపింది.. భక్తిశ్రద్ధలతో శక్తి మరియు శ్రేయస్సు కోరకు అధికారులు మరియు సిబ్బంది అమ్మవారి ఆశీస్సు లను కోరుకున్నారు..
ఈ వేడుకలు ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయం మరియు దైవిక స్త్రీత్వం పట్ల గౌరవాన్ని ప్రతిభించేల సిబ్బంది మరియు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవములు జరుపుకున్నారు.
Comments
Post a Comment