పౌర సరఫరాల శాఖ తనిఖీలు


 పౌర సరఫరాల శాఖ తనిఖీలు

పెట్రో డీలర్ల గుండెల్లో రైళ్లు 


నల్గొండ లో పెట్రోల్ బంక్ ల ఆకస్మిక తనిఖీ 


హలో.. ఈస్ ఇట్.. బి పి సి ఎల్ సేల్స్ ఆఫీసర్.

అయామ్ మాచన రఘునందన్ ఫ్రమ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్.

వి ఫౌండ్ ..

ఎయిర్ మిషన్ ఈస్ నాట్ వర్కింగ్ సిన్స్ ఫ్యూ మంత్స్.అండ్ టాయిలెట్స్ ఆర్ నాట్ క్లీన్. వి విల్ టేక్ యాక్షన్ అగైనిస్ట్ డీలర్స్.. థోస్ హూ..ఆర్ నెగ్లెక్టిoగ్ పెట్రోల్ మెయింటైన్స్.

ఇలా..తనదైన శైలిలో ఆంగ్లం లో అనర్గళంగా మాట్లాడి అటు చమురు సంస్థ ల సెల్స్ అధికారులకు చెమటలు పట్టించి, గుండెళ్లో రైళ్ళు పరిగెత్తించారు.పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్.

శనివారం నాడు ఆయన నల్గొండ లో పెట్రోల్ బంక్ ల ను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ వర్కింగ్ స్టైల్..వా..రే..వా అనేలా చేసింది. 

పెట్రోల్ బంక్ ల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం డీలర్ల బాధ్యత అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ ఆయా బంకు యాజమాన్యాలకు స్పష్టం చేశారు.నల్గొండ పట్టణం లో పలు పెట్రోల్ బంక్ ల ను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొన్ని పెట్రోల్ బంక్ ల్లో మౌలిక సదుపాయాల ను కల్పించడం లో అశ్రద్ధ , అలసత్వం, నిర్లక్ష్యo తాండవిస్తున్నాయని వాటికి చెక్ పెట్టడానికి విస్త్రుత తనిఖీలు చేపట్టినట్టు రఘునందన్ చెప్పారు.ఏయిర్ మిషన్ పని చేయటం లేదు,మంచి నీళ్లు ఉండవు, టాయిలెట్లు శుభ్రంగా ఉండవు అనే ఫిర్యాదులు వస్తున్నాయని,ఈ నేపధ్యం లో నే పెట్రోల్ బంక్ ల తనిఖీలు నిర్వహించినట్టు రఘునందన్ తెలిపారు.

మౌలిక సదుపాయాలు లేవు,అనే ఫిర్యాదులు రాకుండా జాగ్రత్త పడాలని రఘునందన్ సూచించారు.పెట్రోల్ బంక్ ల్లో నాణ్యత పరీక్ష కోసం ఫిల్టర్ పేపర్ ను కూడా అందుబాటులో ఉంచాలని రఘునందన్ స్పష్టం చేశారు.మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉంటే, జరిమానా విధింపు కు సిఫారసు చేస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంక్ లు తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పారు

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం