TGPCB లో ఘనంగా తెలంగాణ పరిపాలన దినోత్సవం
TGPCB లో ఘనంగా తెలంగాణ పరిపాలన దినోత్సవం
హైద్రాబాద్:
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) ప్రధాన కార్యాలయం సనత్‌నగర్లో ప్రాంగణంలో ఈరోజు తెలంగాణ పరిపాలన దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి జి రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. మండలిలోని అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధులకు మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకులకు నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య విలువలు, ఐక్యత మరియు దేశభక్తిని పాటించేందుకు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా సభ్య కార్యదర్శి ప్రసంగిస్తూ, భారతదేశంలో తెలంగాణ విలీనం జరిగిన చారిత్రాత్మక ఘట్టమని గుర్తు చేస్తూ, ప్రజాస్వామ్యం, ఐక్యత మరియు సమగ్రత విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు టీఎస్పీసీబీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
ఉద్యోగులు, అధికారులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ విమోచన కోసం పోరాడిన నాయకులకు ఘనంగా నివాళులు అర్పించారు.
Comments
Post a Comment