టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్
మాచన రఘునందన్
22 ఏళ్ల"క్విట్ స్మోకింగ్" ఉద్యమం
అతని తపన , కసి సినిమా రంగం లో పెడితే..రీల్ హీరో మాత్రమే అయ్యేవారు.
ఎందరో స్మోకింగ్ కు గుడ్ బై చెప్పేలా చేసిన రియల్ "హీరో" గా..అవార్డు పొందారు మాచన రఘునందన్
"ఎవడైనా పని శ్రద్ధ గా చేస్తాడు,లేదా ఓపిక తో చేస్తారు.వాడేంటి కసి తో చేస్తున్నాడు."
ఇది ఓ తెలుగు సినిమా లో డైలాగ్.
ఈ డైలాగ్ కు ..ఈ స్టోరీ కి ఏంటి సంబంధం అంటే?!
ఏ పని చేసినా..
ఏ పని ఒప్పుకున్నా..
"నా..కేంటీ?!"."నా కేం లాభం".,ఇలా..ఏ పని చేసినా..అందుకు తగ్గ ప్రతిఫలం ఆశించడం సర్వ సాధారణం.
కాస్తో..కూస్తో..స్వార్థ చింతన కలిగి ఉండటం కూడా సహజమే.
కానీ..స్వలాభం,లాభాపేక్ష వంటివి లేకుండా..ఉండే వారు అరుదు అనే కన్నా బహు అరుదు అనే చెప్పాలి.
22 ఏళ్లుగా తన సమయం,శక్తి,యుక్తి,అన్ని కూడా దేశ హితం కోసం,సమాజ హితం కోసం వెచ్చించి,ఇలాంటి వ్యక్తులు ఉన్నారా?! ఈ లోకం లో..ఈ కలి యుగం లో అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే లా.. చేస్తున్నారు ఓ వ్యక్తి,అతను ఓ సాదా సీదా ఉద్యోగి.ఎంతో ఆసక్తికరంగా..ఆశ్చర్యంగానూ ఉండే "రియల్ స్టోరీ" లో ఉన్న వ్యక్తి రీల్ హీరో కాదు రియల్"హీరో" నే.
మాచన రఘునందన్..
ఓ పదిహేనేళ్ళు ఎవరూ ఇతన్ని ఇతని కృషి ని అంతగా పాటించుకోలేదు.అడపా దడపా ఓ స్టోరీ ఇవ్వడం, ఓ వార్త రాయడం వరకే పరిమితం అయ్యింది. జన బాహుళ్యానికి మాచన రఘునందన్ పరిచయం.
మొన్న ఆగస్టు లో రఘునందన్ రాసిన లేఖ కు రాష్ట్రపతి భవన్ స్పందించడం,ఆ వెంటనే అన్ని రాష్ట్రాలకు నిర్దేశాలు వెళ్లడం తో..
ప్రధాన పత్రికలు కాస్త ఫోకస్ చేసాయి.కాగా..ఆగస్ట్ 15 న దేశం లో నే అత్యున్నత పురస్కారం టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ తొలి సారి ఓ తెలుగు వ్యక్తి కి దక్కడం తో..యావత్ భారత దేశంలో మాచన రఘునందన్ ప్రత్యేకత "వావ్.. వాట్ ఏ వండర్" అనే స్థాయికి చేరింది.
పొగాకు నియంత్రణ అనే సమాజ హిత క్రతువు కు తనకు తనే ఓ హోమం గా మారిన వ్యక్తి గురించి ప్రత్యేక కథనం.
5 సంవత్సరాలు
500 గ్రామాలు
5000 కిలో మీటర్ల ప్రయాణం.
ఇది ఏ పుణ్య క్షేత్ర సందర్శన యాత్ర కాదు.
విద్యార్ధులు,యువత సిగరెట్ తదితర పొగాకు ఉత్పత్తుల కు బలి కాకుండా ఓ వ్యక్తి చేసిన టూ వీలర్ ట్రావెల్.
పొగాకు నియంత్రణ లో దేశం లో నే అత్యున్నత పురస్కారం "హీరో" అవార్డు.
దాన్ని కైవసం చేసుకోవడం తన జీవితం లో ఓ మైలు రాయి అని నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డు గ్రహీత మాచన రఘునందన్.
దసరా పండుగ సందర్భంగా..
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) వైద్యుల తో పాటు..దేశ వ్యాప్తంగా ఉన్న టుబాకో కంట్రోల్ స్టాల్ వర్ట్స్ తనకు ఫోన్ చేసి అభినందనలు చెప్పడం ఓ మధురానుభూతి అని రఘునందన్ అన్నారు.
"స్కూళ్లు కాలేజీల వద్ద విద్యార్ధులు, యువత సిగరెట్ కు అలవాటు అవుతున్నారు. దయచేసి కనీసం పాఠశాలలు కళాశాల వద్దనైనా సిగరెట్ ల తో పాటు పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించండి" అని రాష్ట్రపతి భవన్ కి లేఖ రాస్తే..
రాష్ట్రపతి భవన్ నుంచి అనూహ్యంగా స్పందన రావడం ఓ అద్భుతం అని అభివర్ణించారు. ఆ స్పందన అంత సామాన్య విషయం కాదన్నారు.
దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది అన్నారు
22 ఏళ్ల
అలుపెరుగని కృషి ఫలితమే "హీరో" అవార్డు అని మాచన రఘునందన్ అన్నారు.
జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో
అద్భుత ఫలితం రావడం పద్మ పురస్కారమే అన్నారు.
"ఎంత సంపాదించాము.ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందరి కి భిన్నంగా మావాడు(మాచన రఘునందన్) దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలను, ఎందరో వ్యక్తులను, వారి ఆలోచన ను తన కృషి తో..
"ఇలా..చేయగలగడం సాధ్యమేనా.?! అని ఆశ్చర్య పోయేలాచేసింది".
"రఘునందన్ కు అవార్డు ఇవ్వక పోతే.?!"ఒక ధీరుణ్ణి నిరుత్సాహపరచడమే" అని భావించి,
లెట్.. హిమ్ గెట్ దిస్ అవార్డ్" అని ఎంపిక కమిటీ సభ్యులను ఆలోచింపజేసింది అంటే అంత ఆషా మాషి కాదు.
మేడ్చల్ జిల్లా కేశవరం కు చెందిన మాచన రఘునందన్
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ గా పని చేస్తూనే..జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ ను అనూహ్యంగా కైవసం చేసుకున్నారు.
పొగాకు నియంత్రణ అనే గాక విద్యార్ధులు, యువత పొగాకు ఉత్పత్తుల కు బలి కాకుండా స్కూళ్లు కాలేజీల వద్ద సిగరెట్ ల విక్రయాలను నిషేధించాలి అంటూ..ఇటీవల రాష్ట్రపతి వరకు సైతం విషయాన్ని తీసుకెళ్ళారు.ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి , ఆయా రాష్ట్రాలకు స్కూళ్లు, కాలేజీల వద్ద సిగరెట్ బీడి గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల విక్రయాల ను నిషేధించండి అంటూ నిర్దేశాలు వెళ్లాయి.
ఈ ఆదేశాల వెనక మాచన రఘునందన్ అలుపెరుగని కృషి ఉంది.ముఖ్యం గా అమ్మ అండ ఉంది.అమ్మ అభయ హస్తం కూడా ఉంది.
**************************
అమ్మ త్యాగం చెప్పలే"నిధి"
నేను,డిగ్రీ లో ఉన్నపుడు అనుకునెవాణ్ణి,అమ్మ మన కోసం ఇంతగా కష్టపడుతోంది. అమ్మ కళ్ళలో ఏ రోజు ఐనా.. ఆ కష్టం మరచిపోయేలా..ఓ గొప్ప విజయాన్ని కానుకగా ఇవ్వాలి అని 20 ఏళ్ల కిందటే మానసికంగా దృఢంగా తీర్మానించుకోవడం వల్లే..ఇపుడు ఈ అసామాన్య విజయం సాధించిన సంతోషం కలుగుతోంది.
అమ్మ , ఓ ఐదారేళ్ళ పాటు..
న్యూ బాకారం బాలాజీ టాకీస్ ఏరియా నుంచి నడచుకుంటూ వెళ్లి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ స్కూల్ లో చెప్పి వచ్చేది.రోజూ అలా..20 కిలో మీటర్ల దూరం నడచుకుంటూ.. వెళ్ళి రావడం..అదీ కేవలం స్వల్ప వేతనం కోసం అంటే..ఇప్పటికీ నాకు ఒకింత బాధగా గానే ఉంటుంది.
_మాచన రఘునందన్
టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్
Comments
Post a Comment